Sreeleela: చిరు సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసిన శ్రీలీల?

  • August 18, 2024 / 06:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) ‘భోళా శంకర్’ (Bhola Shankar) రిజల్ట్ తో ఆలోచనలో పడ్డారు. అందుకే రెండు ప్రాజెక్టులను పక్కన పెట్టేసి ‘విశ్వంభర’  (Vishwambhara) ని పట్టాలెక్కించారు. ‘బింబిసార’ (Bimbisara)  తో బ్లాక్ బస్టర్ అందుకున్న మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta)   దర్శకుడు. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. త్రిష (Trisha) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే 60 శాతం పైనే షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

Sreeleela

ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) అప్పుడే 4 పాటలకు సంబంధించిన ట్యూన్స్ కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. మిగిలినవి డివోషనల్ ఫీల్ తెచ్చే బిట్ సాంగ్స్ ఉండొచ్చట. అయితే ఆ 4 పాటల్లో ఒకటి స్పెషల్ సాంగ్ గా ఉంటుందట. అందులో నర్తించేందుకు ఓ హీరోయిన్ కావాలి. అందుకోసం శ్రీలీలని సంప్రదించినట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. కానీ ఈ సాంగ్లో చిందులేసేందుకు ఆమె నిరాకరించిందట. గతేడాదితో పోలిస్తే శ్రీలీలకి (Sreeleela) ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. ఈ టైంలో స్పెషల్ సాంగ్స్ చేస్తే.. ఆమె డిమాండ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.

అందుకోసమే.. చిరంజీవి సినిమా అయినప్పటికీ, నో చెప్పిందని తెలుస్తుంది. దీంతో మేకర్స్ మరో హీరోయిన్ కోసం గాలిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. గతేడాది ‘బ్రో’ (BRO) సినిమాలో ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) చేసిన స్పెషల్ సాంగ్ కోసం కూడా ముందుగా శ్రీలీలని సంప్రదించారట. అప్పుడు కూడా ఆమె నో చెప్పింది. సో అప్పుడు తమ్ముడు సినిమాలో.. ఇప్పుడున్న సినిమాలో.. స్పెషల్ సాంగ్స్ చేయడానికి శ్రీలీల నిరాకరించినట్టు స్పష్టమవుతుంది. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) లో శ్రీలీలనే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.

‘తంగలాన్’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus