పూజా హెగ్డే, శ్రీలీల… ఈ ఇద్దరిలో ‘గుంటూరు కారం’ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ ఎవరు అంటూ ఆ మధ్య ఓ చర్చ జరిగింది. దానికి సినిమా నిర్మాణ సంస్థ నుండి ‘మాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఫస్ట్, సెకండ్ అంటూ లెక్కేమీ లేదు. ఇద్దరూ మా సినిమాలో హీరోయిన్లే’ అని చెప్పారు. ఆ విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు మరోసారి ఇదే చర్చ వచ్చింది. అవును సినిమాలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరిలో ఫస్ట్ హీరోయిన్ ఎవరు అనేది లేటెస్ట్ డిస్కషన్.
అదేంటి… నిర్మాణ సంస్థ అంతగా చెప్పినా మళ్లీ డిస్కషన్ ఏంటా అనా? కారణం ఉంది. తొలుత అయితే పూజా హెగ్డే సీనియర్, అలాగే తొలుత ఎంపిక చేశారు కాబట్టి ఆమె ఫస్ట్ హీరోయిన్ అని అన్నారు. జూనియర్, తర్వాత ఎంపికైంది కాబట్టి శ్రీలీలను సెకండ్ హీరోయిన్ అనుకున్నారు. ఇద్దరిలో ఎవరి పాత్ర ఏంటి అనేది తెలియకపోయినా లెక్క అలా వేసుకున్నారు. అయితే అనూహ్య పరిస్థితుల్లో ఈ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకుంది. దీంతో మళ్లీ చర్చ మొదలైంది.
గతంలో వచ్చిన పుకార్ల ప్రకారం అయితే పూజా హెగ్డే పాత్రను (Sreeleela) శ్రీలీలకు ఇచ్చారని, ఆమె పాత్రలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారని పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ కాదు కాదు, శ్రీలీల సేమ్ పాత్రలోనే నటిస్తోందని, మీనాక్షి చౌదరిని పూజా హెగ్డే ప్లేస్లో తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో అసలు పంచాయితీ మళ్లీ మొదలైంది. నిజానికి సినిమాలో శ్రీలీల లుక్లో కూడా విలేజ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఆమె మహేష్ పాత్రకు మరదలు అనుకోవచ్చు.
ఇక సినిమాలో కీలకమైన రిపోర్టర్ పాత్రను మీనాక్షి చౌదరి చేస్తోంది. ఆ పాత్ర తొలుత పూజా చేయాలి. ఆమె కోసం మహేష్ విలన్లతో పోరాడుతాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఈ లెక్కన ఫస్ట్ హీరోయిన్ మీనాక్షి అనే చెప్పాలి. సెకండ్ హీరోయిన్ శ్రీలీల అవుతుంది. చూద్దాం మళ్లీ నిర్మాణ సంస్థ ఏమన్నా క్లారిటీ ఇస్తుందో, లేక పాత డైలాగే చెబుతుందో. అసలు విషయం క్లారిటీగా తెలియాలంటే వచ్చే సంక్రాంతి రావాల్సిందే. అప్పుడు సినిమా విడుదల కావాల్సిందే.