Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 6, 2026 / 09:18 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వంశీ తుమ్మల (Hero)
  • సంధ్య వశిష్ట (Heroine)
  • గోపీనాథ్, శివకుమార్ మట్టా, కల్పలత గార్లపాటి తదితరులు (Cast)
  • వినయ్ రత్నం (Director)
  • చింతా గోపాలకృష్ణ రెడ్డి - చింతా వినీషా రెడ్డి (Producer)
  • చందు - రవి (Music)
  • ఆకాశి రామ్ పోదిశెట్టి (Cinematography)
  • అన్వర్ అలీ (Editor)
  • Release Date : ఫిబ్రవరి 06, 2026
  • శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ (Banner)

ఈమధ్యకాలంలో కేవలం టీజర్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న చిన్న సినిమా ఏదైనా ఉంది అంటే.. “శ్రీ చిదంబరం గారు” అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. అదే తరహాలో, అదే ఎనర్జీతో ట్రైలర్ మరియు పాటలు కూడా అలరించాయి. ఈవారం విడుదలైన తెలుగు సినిమాల్లో టాప్ ప్రియారిటీ సినిమా ఇదే అని చెప్పాలి. మరి కొత్త బృందం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించారు అనేది చూద్దాం..!!

Sri Chidambaram Garu Movie Review

Sri Chidambaram Garu Movie Review and Rating

కథ: రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఒకటైన పుల్లంగి అనే గ్రామంలో ఓ సాధారణ నిర్మాణ కూలీగా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో నాన్న చనిపోక ముందు చేసిన అప్పులు తీరుస్తూ.. తల్లితో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంటాడు సోలోమన్ (వంశీ తుమ్మల). అయితే చిన్నప్పటినుండి మెల్లకన్ను కారణంగా ఊరంతా అతడ్ని చిదంబరం అని పిలుస్తూ ఉంటారు.

తన లోపాన్ని నల్ల కళ్లద్దాల వెనుక దాచిపెట్టి, తన బాధను గుండెల్లో అదిమిపెట్టి బ్రతికేస్తుంటాడు. అయితే.. తాను ప్రేమించిన అమ్మాయి కూడా తన లోపాన్ని వేలెత్తి చూపడం తట్టుకోలేక.. ఎలాగైనా తన మెల్లకన్నును సరి చేసుకోవాలని ఏవేవో పిచ్చి ప్రయత్నాలు మొదలెడతాడు. ఈ క్రమంలో సోలోమన్ తెలుసుకున్న జీవిత సత్యం ఏమిటి? అనేది “శ్రీ చిదంబరం గారు” కథాంశం.

Sri Chidambaram Garu Movie Review and Rating

నటీనటుల పనితీరు: నటుడిగా వంశీ ఎక్కువ కష్టపడినప్పటికీ.. సంధ్య ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. క్రిస్టియన్ లుక్స్ మొదలుకొని గోదావరి యాస వరకు అన్నీ చాలా నీట్ గా వర్కవుట్ చేసుకుంది సంధ్య. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన పతాక స్థాయిలో ఉంది.

వంశీ కూడా మెల్లకన్ను పెట్టి నటించడం ఎంతో కష్టమైనా.. నేర్పుతో చేశాడు. తనలోని లోపం తాలూకు బరువును గుండెల్లో మోస్తూ, పైకి మామూలుగా ఉండే సన్నివేశాల్లో ఎమోషన్ ను అద్భుతంగా పండించాడు.

గోపీనాథ్ లిమిటెడ్ సీన్స్ అయినప్పటికీ.. ఉన్నంతలో చక్కగా నవ్వించాడు. ఇంకొన్ని సన్నివేశాలు ఉంటే బాగుండు అనిపించింది.

తల్లి పాత్రల్లో కల్పలత, తులసిలు చాలా సహజంగా ఒదిగిపోయారు.

Sri Chidambaram Garu Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: చందు-రవిల పాటలు ఎంత స్పష్టంగా, వినసొంపుగా, హాయిగా ఉన్నాయో.. సినిమాతో సంబంధం లేకుండా అలా వాళ్ల పాటలు కానీ నేపథ్య సంగీతం కానీ వింటూ కూర్చుండిపోవచ్చు. ముఖ్యంగా కీరవాణి పాడిన వెళ్లే దారిలోన పాట అర్థవంతంగా, కథా గమనానికి అద్దం పట్టింది. పాటల్లో సాహిత్య సంపద ముచ్చటగా ఉంది.

రామ్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ ను చాలా చక్కగా చెక్కాడు. సినిమా మూడ్ కి తగ్గట్లుగా కలర్ టోన్ ని డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. పుల్లంగి లాంటి లొకేషన్ దొరకడం, దాన్ని చక్కగా సద్వినియోగపరుచుకోవడం ప్రశంసార్హం. అలాగే.. కాస్త కష్టతరమైన సింక్ సౌండ్ ను కూడా బాగా మ్యానేజ్ చేసారు. అందువల్ల సినిమా చాలా ఆర్గానిక్ గా ఉంటుంది.

దర్శకుడు వినయ్ రత్నం ఎంచుకున్న కథలో నావెల్టీ ఉంది. అయితే.. కథనంలో, ముఖ్యంగా సెకండాఫ్ లో ఎమోషన్ లోపించింది. మరీ ముఖ్యంగా.. హీరో తన లోపాన్ని రియలైజ్ అవ్వడానికి, తనకంటే పెద్ద లోపం ఉన్న మనిషి జీవితాన్ని చూపించడం అనే జస్టిఫికేషన్ సహజంగా లేదు. చిన్న చిన్న సందర్భాలు, సన్నివేశాలు ఎంతో హృద్యంగా రాసుకున్న విజయ్.. కీలకమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని పేలవంగా డీల్ చేసిన విధానం సినిమాకి మైనస్ గా మారింది.

అలాగే.. సీన్ కంపోజిషన్ విషయంలో ఇమ్మెచ్యురిటీ కనిపిస్తుంది. డ్రామాను రాసుకోవడంలో, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో ఇంకాస్త పరిణితి అవసరం. అయితే.. దర్శకుడిగా అతడి వద్ద చాలా ఫ్రెష్ థాట్స్ ఉన్నాయి. వాటిని సరిగ్గా ఛానలైజ్ చేసుకోవాలి. ఓవరాల్ గా.. వినయ్ రత్నంని ఒక మంచి ఒరిజినల్ టాలెంట్ గా అంగీకరించవచ్చు కానీ.. ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ అవసరం.

Sri Chidambaram Garu Movie Review and Rating

విశ్లేషణ: సహజత్వం చాలా అందంగా ఉంటుంది. అయితే.. ఆ సహజత్వానికి సరైన స్థాయి భావోద్వేగం మేళవించినప్పుడే కంటెంట్ పూర్తిస్థాయిలో పండి.. ప్రేక్షకులకి ఒక చక్కని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ విషయంలో వినయ్ రత్నం & టీమ్ కాస్త తడబడ్డారు. మంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్ రాసుకొని, రియలైజేషన్ పాయింట్ ఇంకాస్త సెన్సిబుల్ గా డీల్ చేసి ఉంటే.. “శ్రీ చిదంబరం గారు” కచ్చితంగా తెలుగు టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచేది. అది లోపించడంతో ఓ సగటు సింపుల్ సినిమాగా మిగిలిపోయింది.

Sri Chidambaram Garu Movie Review and Rating

ఫోకస్ పాయింట్: సహజత్వంలో భావోద్వేగం కొరవడింది!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sandhya Vasishta
  • #Sri Chidambaram Garu Movie
  • #Vamsi Tummala
  • #Vinay Ratnam

Reviews

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

16 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

16 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

6 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

7 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

22 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

23 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version