Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 6, 2025 / 01:50 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నార్నె నితిన్ (Hero)
  • సంపద (Heroine)
  • రావు రమేష్, నరేష్, రచ్చ రవి తదితరులు.. (Cast)
  • సతీష్ వేగేశ్న (Director)
  • రామారావు చింతపల్లి (Producer)
  • కైలాష్ మీనన్ (Music)
  • దాము నర్రావుల (Cinematography)
  • Release Date : జూన్ 06, 2025
  • శ్రీ వేదాక్షర మూవీస్ (Banner)

ఎన్టీఆర్ బామ్మర్దిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ (Narne Nithin) “మ్యాడ్(MAD), ఆయ్,(AAY) ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) ” సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకునే పనిలో ఉన్నాడు. అయితే.. నార్నె నితిన్ (Narne Nithin) హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా “శ్రీ శ్రీ శ్రీ రాజావారు” (Sri Sri Sri Raja Vaaru) చాన్నాళ్ల పాటు ల్యాబులో నలిగి ఎట్టకేలకు ఇవాళ (జూన్ 06) థియేటర్లలో విడుదలైంది. మరి నార్నె నితిన్ అసలైన మొదటి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

Sri Sri Sri Raja Vaaru Review

Sri Sri Sri Raja Vaaru Movie Review and Rating! (1)

కథ: పుట్టుకతోనే సిగరెట్ వంటబట్టించుకున్న రాజా (నార్నె నితిన్) అనంతరం ఆ సిగరెట్ కు అడిక్ట్ అయ్యి.. రోజుకి కనీసం 5 సిగరెట్లు కాల్చకుండా ఉండలేకపోతుంటాడు. సొంత ఊర్లో పాలు అమ్ముతూ మంచి సంపాదన, మంచి కుటుంబం, మంచి పేరు ఉన్నప్పటికీ.. రాజా సిగరెట్ అడిక్షన్ కారణంగా ఊరంతా అతడ్ని “శ్రీ శ్రీ శ్రీ రాజావారు” అని వెటకారం చేస్తుంటారు.

కట్ చేస్తే.. ఆ సిగరెట్ అడిక్షన్ అనేది రాజా జీవితాన్ని కుదిపేస్తుంది, ఇక సిగరెట్ కి దూరంగా ఉండాల్సి వస్తుంది.

తన లైఫ్ ను ఇరకాటంలో పెట్టిన సిగరెట్ అడిక్షన్ నుంచి రాజా బయటపడ్డాడా? అందుకోసం ఎంత కష్టపడ్డాడు? అనేది సినిమా (Sri Sri Sri Raja Vaaru ) కథాంశం.

Sri Sri Sri Raja Vaaru Movie Twitter Review

నటీనటుల పనితీరు: నార్నె నితిన్ కి ఇది నిజంగానే మొదటి సినిమా అయినప్పటికీ.. నటుడిగా ఆకట్టుకున్నాడనే చెప్పాలి. అయితే.. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ బానే ఉన్నా దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ లేకపోవడం వల్ల.. ఎమోషనల్ సీన్స్ లో అతడి నటన బాగున్నప్పటికీ, డీలింగ్ కారణంగా అది ఓవర్ యాక్షన్ లా అనిపిస్తుంది.

హీరోయిన్ గా సంపద పర్వాలేదనిపించుకుంది. పల్లెటూరి పడుచుగా ఆమె నటన, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజన్స్ డీసెంట్ గా ఉన్నాయి.

రావు రమేష్ (Rao Ramesh), నరేష్ (Naresh), శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar) వంటి సీజనల్ ఆర్టిస్టులు ఎప్పట్లానే తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

రచ్చ రవి (Racha Ravi), సుదర్శన్ (Sudharshan) కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు కానీ.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

ఇక ప్రత్యేక పాత్రల్లో రఘు కుంచె, రవి వర్మలు కాస్త సర్ప్రైజ్ చేశారు కానీ.. వాళ్ల క్యారెక్టర్ కూడా సరిగా పండలేదు.

Sri Sri Sri Raja Vaaru Movie Review and Rating! (1)

సాంకేతికవర్గం పనితీరు: కైలాష్ మీనన్ పాటల్లో ఓ రెండు బాగున్నాయి కానీ.. మిగతా పాటలు మాత్రం భరించడం కష్టమే. ముఖ్యంగా రఘు కుంచె-రవి వర్మలు పాడే పాట ఎప్పడు అయిపోతుందా అని ఎదురుచూసేలా ఉంది. నేపథ్య సంగీతం పరంగానూ పెద్దగా ఎమోషన్స్ ని కానీ, ఎలివేషన్స్ ని కానీ పెద్దగా ఎలివేట్ చేయలేదు.

దాము (Damu Narravula) సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. తక్కువ బడ్జెట్ & మినిమల్ ఎక్విప్మెంట్ తో క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చాడు.

ఈ సినిమాకి మెయిన్ విలన్ కథ. హీరోకి సిగరెట్ ప్రాణం పోసింది సరే, కానీ అడిక్షన్ ఎలా మొదలయ్యింది? మరీ సిగరెట్లు ఆపకుండా కాల్చుస్తున్నట్లుగా ఎక్కడా చూపించలేదు. అలాగే.. కాల్చకుండా ఉండడం కోసం తెగ ఇబ్బందిపడిపోతున్నట్లుగా కూడా పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఈ తరహా కాన్సెప్ట్ తోనే కార్తికేయ (Kartikeya) “90 ML” అనే సినిమా వచ్చింది, అందులో హీరో మందు లేకపోతే బ్రతకడు అనేది చూపించడం వల్ల ఇది సమస్య అన్నమాట అని అర్థమై.. మందు లేకుండా హీరో ఎందుకు ఉండలేదు అనేందుకు సరైన జస్టిఫికేషన్ ఉంటుంది.

కానీ.. “శ్రీ శ్రీ శ్రీ రాజారావు” చిత్రంలో అలాంటి జస్టిఫికేషన్ ఏమీ లేదు. జస్ట్ అదొక చెడు అలవాటు అంతే. అందులో ఎమోషన్ ఏముంటుంది? అసలు ఇంత సిల్లీ పాయింట్ తో ఫ్యామిలీ ఎమోషన్స్ పండించాలని ప్రయత్నించడమే పెద్ద విఫలయత్నం. సతీష్ వేగేశ్న ఇంత సిల్లీ పాయింట్ తో 140 నిమిషాల సినిమాను ఎలా నడిపించాలి అనుకున్నాడు అనేది ఆయనకే తెలియాలి. ఆర్టిస్టులు అందరి నుండి మంచి నటన రాబట్టుకోవడం మినహా దర్శకుడిగా ఆయన ప్రూవ్ చేసుకుంది ఏమీ లేదనే చెప్పాలి.

Sri Sri Sri Raja Vaaru Movie Review and Rating! (1)

విశ్లేషణ: నార్నె నితిన్ ఈ సినిమా ఎందుకు ప్రమోట్ చేయలేదు అనేది సినిమా చూసాక అందరికీ అర్థమవుతుంది. అయినప్పటికీ.. అతడ్ని నమ్ముకుని నిర్మాతలు డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు.. వాళ్ల డబ్బుకి, సమయానికి కనీస స్థాయి గౌరవం ఇవ్వడం అనేది నటుడిగా కనీస బాధ్యత. కనీసం ఒక్క ట్వీట్ వేసున్నా సరిపోయేది. ఈ విషయం పక్కన పెడితే.. “శ్రీ శ్రీ శ్రీ రాజావారు” ప్రేక్షకుల్ని కనీస స్థాయిలో ఆకట్టుకోలేక చతికిలపడింది.

Sri Sri Sri Raja Vaaru Movie Review and Rating! (1)

ఫోకస్ పాయింట్: కష్టం రాజావారు!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh
  • #Narne Nithin
  • #Rao Ramesh
  • #Sampanda
  • #Satish Vegesna

Reviews

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

1 hour ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

1 hour ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

1 hour ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

14 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

15 hours ago

latest news

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

15 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

16 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

17 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version