హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన యాంకర్ శ్రీముఖి

  • January 21, 2017 / 01:48 PM IST

బుల్లి తెర యాంకర్లకు వెండి తెరపై అవకాశాలు వెళ్లు వెత్తుతున్నాయి. హాట్ యాంకర్ రష్మీ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంటే, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతోంది. లాస్య కూడా ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి కూడా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సోగ్గాడు మూవీలో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా నటిస్తున్న శ్రీ ముఖి, ఇప్పుడు ప్రధాన హీరోయిన్ గా చేయనుంది.

నటుడు, డైలాగ్ రైటర్ హర్షవర్ధన్ దర్శకుడిగా పరిచయం కావడానికి ఓ కథను సిద్ధం చేసుకున్నారు. ఈ విభిన్న కథకు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. వినూత్నంగా ఉండే కథలో లీడ్ రోల్ కి శ్రీముఖిని తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం హర్షవర్ధన్ తో పాటు, శ్రీ ముఖికి మంచి బ్రేక్ ఇస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus