Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

Advertisement

స్టాండ్‌అప్ కామెడీ రోజు రోజుకి హద్దు మీరుతోంది అనటానికి ప్రత్యక్ష ఉదాహరణ తాజాగా మెగా ఫ్యామిలీ వ్యక్తులపై స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల చేసిన అనుచిత వ్యాఖ్యలే. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపిన ఈ సంఘటన చివరికి స్టాండ్‌అప్ కమెడియన్ అనుదీప్ కటికాల అరెస్ట్ వరకు వచ్చింది. ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సమాచారం ప్రకారం, ఏప్రిల్ 14న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో అతడిని పోలీసులు గుర్తించి కస్టడీలోకి తీసుకున్నారు.

Standup Comedy

హైదరాబాద్‌కు చెందిన అనుదీప్, తన స్టాండ్‌అప్ షోలతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఇటీవల విడుదల చేసిన “Tollywood Roast” వీడియో అతడిని వివాదాల మధ్యకి నెట్టింది. ఈ వీడియోలో జనసేన అధినేతపవన్ కళ్యాణ్, నటుడు రామ్ చరణ్, అలాగే వారి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి.

ప్రత్యేకంగా వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్‌పై అభిమానులు, రాజకీయ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసు నమోదు కావడం పరిస్థితిని మరింత సీరియస్ చేసింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా అతని లొకేషన్ ట్రేస్ చేసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ వివాదం పెరుగుతుండగా, అనుదీప్ తన సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పాడు. తన ఉద్దేశ్యం ఎవరినీ దూషించడం కాదని, ‘రోస్ట్’ ఫార్మాట్‌లో భాగంగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ, హాస్యం పేరుతో వ్యక్తిగత పరువు నష్టం కలిగించడం ఎంతవరకు సమంజసం అన్న చర్చ మళ్లీ మొదలైంది. ఇప్పటికే ఈ ఘటనపై చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుండగా, భవిష్యత్తులో స్టాండ్‌అప్ కామెడీ హద్దులు, బాధ్యతలపై మరింత జాగ్రత్త వహించాలని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus