ఈ వెడ్డింగ్ సీజన్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన తారలంతా పెళ్లి పీటలెక్కుతున్నారు.. ఇప్పటికే హన్సిక, నాగ శౌర్య వంటి వారు మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. కన్నడ యాక్టర్స్ హరిప్రియ, వశిష్ట ఎన్. సింహా, సీనియర్ నటి సుమలత, స్వర్గీయ అంబరీష్ దంపతుల కొడుకు, యువ నటుడు అభిషేక్ అంబరీష్ తదితరులు నిశ్చితార్థాలు చేసుకున్నారు.. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కపుల్.. తల్లిదండ్రులు కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు..
ఇప్పుడు ఓ పాపులర్ నటుడు 51 సంవత్సరాల వయసులో ముచ్చటగా మూడోసారి తండ్రి అయిన విషయాన్ని ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.. దీంతో ఈ న్యూస్ కాస్తా వైరల్ అవుతోంది..వివరాల్లోకి వెళ్తే.. మనోజ్ తివారి.. హిందీ, భోజ్‌పురి వాళ్లకి కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు ఇది.. నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఎంపీగా (నార్త్ ఈస్ట్ ఢిల్లీ) కొనసాగుతున్నారు. మనోజ్ తివారీకి సురభి రెండో భార్య.
కాగా.. 1999లో రాణి తివారీని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2012లో ఆమెతో విడిపోయారు.. వీరికి రితి అనే కూతురు ఉంది. ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు, 2020లో సురభి తివారీని పెళ్లి చేసుకోగా.. అదే ఏడాది వీరికి ఓ పాప పుట్టింది.. ఇప్పుడు మనోజ్ వయసు 51 సంవత్సరాలు.. ఈ ఏజ్‌లో మూడో కూతురికి జన్మనిచ్చి వార్తల్లో నిలిచారు. తనకు కూతురు పుట్టిందన్న విషయాన్ని చెబుతూ.. భార్య సురభితో హాస్పిటల్ లో ఉన్న పిక్ షేర్ చేశారు. ‘మా ఇంటికి లక్ష్మీ తర్వాత సరస్వతి వచ్చింది..
మాకు అందమైన చిన్నారి జన్మించింది.. ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది.. మీరంతా మా బిడ్డను ఆశీర్వదించాలాని కోరుతున్నాం’ అంటూ పోస్ట్ చేశారు.. దీంతో మనోజ్ లేటు వయసులో మరోసారి తండ్రైన విషయం నెట్టింట వైరల్‌గా మారింది. పార్టీ వర్గాల వారు, ఫ్యాన్స్.. ‘కంగ్రాచ్యులేషన్స్ భయ్యా, బాబీ’ అంటూ విషెస్ తెలియజేస్తున్నారు.. ఇటీవల టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఇదే వయసులో రెండో సారి తండ్రి అయిన సంగతి తెలిసిందే..