Star Actor: ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు.. ఫోటోలు వైరల్!

ఇది పెళ్లిళ్ల సీజన్. జూన్ 14 వరకు ముహుర్తాలు ఉన్నాయట. అందుకే కొంతమంది నటీనటులు పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయిపోతున్నారు. ఈ లిస్ట్ లో యూట్యూబర్, తమిళ నటుడు ఎరుమ సాని విజయ్ కూడా చేరాడు. తాజాగా అతను కూడా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. తన గర్ల్ ఫ్రెండ్, మోడల్ అయిన నక్షత్రతో ఏడడుగులు నడిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తున్న నక్షత్రతో విజయ్ చాలా కాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు.

వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపినట్టు వినికిడి. అందుకే ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకుని ఇప్పుడు పెళ్ళికి రెడీ అయిపోయారు. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. నూతన వధూవరులకు కొంతమంది నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. నిశ్చితార్థపు వేడుక నుండి పెళ్లి వరకు ప్రతి మూమెంట్ కు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు నటుడు విజయ్.

ఇతనికి (Star Actor) ఎరుమై సాని అనే యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇతను పోస్ట్ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి.దర్శకుడు హిప్ హాప్ ఆది తెరకెక్కించిన ‘మీసై మురుకు’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఇతను. తర్వాత నాన్ సిరితాల్ అనే సినిమాలో కూడా నటించాడు. అనంతరం డీ బ్లాక్ చిత్రంతో డైరెక్టర్ గా మారాడు. ఇందులో అరుళ్ నిధి, అవంతిక మిశ్ర హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.ఇక విజయ్ పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus