స్టార్‌ హీరోయిన్‌కి అరుదైన గుర్తింపు…

  • December 9, 2020 / 12:48 PM IST

అమ్మాయిలకు నవ్వుకు మించిన అందం ఇంకొకటి ఉండదు అంటారు. హీరోయిన్లకు అయితే అది యూఎస్‌పీగా నిలిచిపోతుంది. అందుకే హీరోయిన్ల నవ్వు మీద కవులు, రచయితల పాటలు కూడా రాసేశారు. అలాంటి ఓ హీరోయిన్‌ నవ్వును ఎగ్జిబిషన్‌లో పెడితే… వావ్‌ కదా. అలాంటి గొప్ప అచీవ్‌మెంట్‌ స్టార్‌ హీరోయిన్‌కు దక్కింది. ఆమె నవ్వుతున్నట్లు ఉన్న ఓ బొమ్మను ఏథెన్స్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది.. ఆ నవ్వు ఆమెదని ఎగ్జిబిషన్‌ బృందం చెప్పడం లేదు. ఎవరా హీరోయిన్‌, ఏంటా నవ్వు అనేది చూద్దాం.

గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ఓ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. హార్ట్‌ఫుల్‌ నవ్వు విరిసిన ప్రముఖుల విగ్రహాలను ఆ ప్రదర్శనలో ఉంచారు. అందులో ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె విగ్రహానికి అందులో చోటు దక్కింది. దీపిక అభిమానులు షేర్‌ చేసిన ఆ ఆ విగ్రహం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఓ ప్రముఖ బాలీవుడ్‌ నటి నవ్వు ఇది ఆ విగ్రహం కింద ట్యాగ్‌లో పెట్టారు. మరోవైపు ఈ విషయంలో దీపిక ఇప్పటి స్పందించలేదు.

వివాహ రిసెప్షన్‌లో దీపిక డ్రెస్సింగ్‌ స్టయిల్‌లో ఈ విగ్రహం రూపొందించారు. నెక్లెస్‌, చీర ఆకారాలు ఆ విగ్రహంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో బొమ్మ కింది పేర్కొన్న ఆ బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె అని అభిమానులు అంటున్నారు. ఈ ఫొటోలు మీరూ చూడండి… అభిమానులు అంటుంది నిజమైతే కింద కామెంట్‌ చేయండి.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus