దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత సినీ రంగంలో హీరోయిన్లకు చక్కగా సరిపోతుంది.. నిజమే మరి.. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి.. డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.. ఇటీవల చాలామంది హీరోయిన్లు తమ టేస్ట్‌కి తగ్గట్టు లగ్జరీ విల్లాలు, అపార్ట్‌మెంట్స్ కొంటున్నారు.. పూజా హెగ్డే, రష్మికతో పాటు మరికొంత మంది కథానాయికలు షూటింగ్స్ కోసం హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండాల్సి రావడంతో సొంతగా ఇళ్లు కొనేసుకున్నారు.. సమంత కూడా బాంబేలో హౌస్ కొనేసింది..
అయితే ఓ హీరోయిన్ మాత్రం హైదరాబాద్‌లో ఇంటి కోసం తెగ ట్రై చేసి.. దొరక్క చివరికి ముంబైలో కొనుక్కుంది..వివరాల్లోకి వెళ్తే.. నివేదా పేతురాజ్.. ఈ మధురై ముద్దుగుమ్మ తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కథానాయికగా స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోయినా.. ఆర్థికంగా మాత్రం బాగానే వెనకేసిందంట.. ‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’, ‘రెడ్’ లాంటి సినిమాలతో ఇక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది..
రీసెంట్‌గా విశ్వక్ సేన్ పక్కన ‘దాస్ కా ధమ్కీ’ చేసి హిట్ కొట్టింది.. అమ్మడి అందాలకు కుర్రకారులో మంచి ఫాలోయింగ్ ఉంది.. ఈ ముప్ఫై ఏళ్ల సుందరి సందర్బాన్ని బట్టి ఆన్ స్క్రీన్ రొమాన్స్‌లో రెచ్చిపోయి రచ్చ చేస్తుంటుంది..అమ్మడు ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది.. అందులో యాక్ట్ చేస్తూనే అక్కడ ఇళ్లు కొనేసింది.. త్వరలోనే మొత్తానికి మకాం మార్చబోతున్నానని చెప్పుకొచ్చింది.. నివేదా ఇప్పటివరకు పెద్ద సినిమాలైతే చేయలేదు..
కానీ.. అటు గ్లామర్ పరంగా, నటన పరంగా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. కాగా.. తక్కువ టైంలో తెలుగుతో పాటు తమిళ సినిమాలలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.. అయితే.. తెలుగు సినిమాలు చేస్తూ.. ముంబైలో ఇల్లు కొనడం గురించి స్పందిస్తూ.. ‘హైదరాబాద్‌లో ఇల్లు కొనడానికి చాలా ట్రై చేశాను.. కానీ.. కుదరలేదు.. మిగతా వివరాలు త్వరలో చెప్తాను’ అని అంది.. ప్రస్తుతం నివేదా పేతురాజ్ ముంబైలో ఇల్లు కొన్న వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది..
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?