చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన వరుణ్ హీరోయిన్.. ఎంతో ఇష్టమంటూ?

  • April 23, 2024 / 08:24 PM IST

వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ (Operation Valentine) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మానుషి చిల్లర్ (Manushi Chhillar) మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసిన మానుషి చిల్లర్ తెలుగులో కూడా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడానికి ఆశ పడుతున్నారు. మానుషి చిల్లర్ తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ చరణ్ (Ram Charan) పై, చరణ్ డ్యాన్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ చరణ్ యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టమని ఈ బ్యూటీ పేర్కొన్నారు.

చరణ్ డ్యాన్స్ అద్భుతం అని ఆమె చెప్పుకొచ్చారు. చరణ్ సినిమాలో ఆయనకు జోడీగా నటించాలని ఆశ పడుతున్నానని మానుషి చిల్లర్ వెల్లడించారు. తెలుగులో నాకు సినిమా ఆఫర్ వస్తే ఆ ఆఫర్ చరణ్ కు జోడీగా రావాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. మానుషి చిల్లర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. బాలీవుడ్ హీరోయిన్లు సైతం రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా నటించాలని ఆశ పడుతున్నారంటే చరణ్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో సులువుగా అర్థమవుతుంది.

మానుషి చిల్లర్ బడే మియా ఛోటా మియా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ విషయాలను చెప్పుకొచ్చారు. సవాల్ చేసే రోల్స్ అంటే ఇష్టమని సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో పని చేస్తానని మానుషి చిల్లర్ వెల్లడించారు. యానిమల్ (Animal) మూవీలో రష్మిక (Rashmika Mandanna) నటించిన రోల్ నాకెంతో నచ్చిందని ఆమె పేర్కొన్నారు. కుటుంబంలో కలతలు వచ్చిన సమయంలో ధైర్యంగా నిలబడిన ఆ పాత్ర అద్భుతం అని ఆమె పేర్కొన్నారు.

మానుషి చిల్లర్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. మానుషి చిల్లర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. కబీర్ సింగ్ మూవీలో ప్రీతి రోల్ కోసం మొదట నాకు అవకాశం వచ్చిందని షాహిద్ మూవీలో ఛాన్స్ అని తెలియక నేను రిజెక్ట్ చేశానని మానుషి చిల్లర్ వెల్లడించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus