వెంటిలేటర్ పై నటి.. దయనీయమైన స్థితిలో ఇలా..!

ఇటీవల నటి అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ యాక్సిడెంట్ అవ్వడంతో ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి 2 వారాలు పూర్తయినా ఆమె ఇంకా కోలుకోలేదట. ఆమె పరిస్థితి విషయంగానే ఉంది అని తెలుస్తుంది. తిరువనంతపురంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అరుంధతి చికిత్స పొందుతుంది. ఆమె ఇప్పటికీ వెంటిలేటర్ పైనే ఉందట. దీంతో రోజూ ఆమెకు కనీసం రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోందని.. ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఇప్పటివరకు ఆమెకు రూ.40 లక్షల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. అరుంధతి తలకు, వెన్నుముక కు బలమైన గాయాలు కావడం వల్లే.. ఆమె ఇంకా కోలుకోలేదని.. మరింతగా ట్రీట్మెంట్ ఇవ్వాలని… 3 నెలలు వరకు ఆమె కోలుకోవడానికి టైం పట్టవచ్చని.. అప్పటికీ కూడా గ్యారెంటీగా చెప్పలేమని వైద్యులు చెబుతున్నారట. ఈ క్రమంలో అరుంధతి కుటుంబం ట్రీట్మెంట్ కి డబ్బులు లేక విలవిలలాడుతుందని.. ఆమె సోదరి ఆర్తి నాయర్ తెలిపింది.

ఈ కష్ట తరుణంలో తన స్నేహితులు అండగా నిలబడి.. క్రౌడ్ ఫండింగ్ వంటివి మొదలుపెట్టారట. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అలాగే అభిమానులు తమకు అండగా నిలబడి సాయం చేయాలని ఈ సందర్భంగా ఆర్తి నాయర్ విన్నవించుకుంది. ఇక అరుంధతి నాయర్ 2014 లో తమిళంలో వచ్చిన ‘పొంగి ఎలు మనోహర’ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘సవిరుమాండికుమ్‌ శివానందికమ్‌’, ‘సైతాన్‌’, ‘పిస్తా’, ‘ఆయిరం పోర్కాసుకల్‌’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus