టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి, ‘బిగ్ బాస్ 19’ ఫేమ్ మాల్తీ చాహర్(Malti Chahar) ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ యాంకర్ సిద్దార్థ్ కన్నన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. తనకు ఎదురైన చేదు అనుభవాలను నిర్భయంగా బయటపెట్టింది.మాల్తీ మాట్లాడుతూ.. ‘ఓసారి ఒక సీనియర్ డైరెక్టర్ తన ఆఫీసులో నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆయన వయసులో చాలా పెద్దవారు కావడంతో నేను తండ్రిలా భావించేదాన్ని. ఒక ప్రాజెక్ట్ పని మీద ఆయన్ని కలిసి తిరిగి వెళ్తున్నప్పుడు..మర్యాదపూర్వకంగా సైడ్ హగ్ ఇద్దామని దగ్గరికి వెళ్లాను. కానీ ఆయన మాత్రం ఒక్కసారిగా నా పెదాలపై ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ వయసులో ఉన్న వ్యక్తి అలా చేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఆ ఘటనతో షాక్‌కి గురైన ఆమె.. వెంటనే ఆయన్ని గట్టిగా వారించి అక్కడి నుంచి వచ్చేసిందట, ఆ తర్వాత ఎప్పుడూ ఆ డైరెక్టర్‌ని కలవలేదని మాల్తీ స్పష్టం చేసింది.అంతేకాదు, కెరీర్ ఆరంభంలో ఓ పెద్ద సౌత్ ప్రొడ్యూసర్ విషయంలోనూ ఇలాంటి అనుభవమే ఎదురైందట. ప్రొడ్యూసర్‌ని హోటల్ రూమ్‌లో కలవాలంటూ సదరు సినిమా డైరెక్టర్ తనకు ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడని, దాంతో ఆ ఆఫర్‌ని అక్కడే రిజెక్ట్ చేశానని మాల్తీ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో కొంతమంది నెటిజెన్లు ఈమెకు మద్దతుగా నిలబడుతున్నారు. ఇంకొంత మంది ఆ దర్శకుడి పేరు చెప్పు అంటున్నారు.