రాఖీ సావంత్.. అందరికీ సుపరిచితమే..! అంటే ఈమె తెలుగు సినిమాల్లో నటించింది అంటూ ఏమీ లేదు. నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. అది కూడా వివాదాలతో..! ‘మీటూ’ టైములో తను శ్రీ దత్తా తో పాటు రాఖీ సావంత్ పేరు కూడా ఎక్కువగా వినిపించింది. ఆమెకు వ్యతిరేకంగా ఈమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈమె వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గతేడాది ప్రేమికుల రోజు నాడు తన భర్తతో తెగదెంపులు చేసుకుని ఈమె హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
అదిల్ దురానీ అనే వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకున్న (Actress) ఈమె.. ఆ తర్వాత అతనితో అలాగే అతని కుటుంబ సభ్యులతో మనస్పర్థలు రావడంతో సెపరేట్ అయ్యింది. అయినప్పటికీ తన భర్త టార్చర్ ఎక్కువైందని.. నన్ను కాపాడాలంటూ చేసిన కామెంట్లు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత అదిల్ ను ఈమె జైల్లో పెట్టించడం కూడా జరిగింది.అంతకు ముందు రితేష్ సింగ్ ను ఈమె మొదటి వివాహం చేసుకుంది.
అతనితో కూడా కొన్నాళ్లకే విడిపోయింది. రితేష్ కి ఆల్రెడీ పెళ్లయిందని, ఆ విషయాన్ని దాచిపెట్టి నన్ను రెండో పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు నన్ను చిత్రహింసలు పెడుతున్నాడని ఆరోపణలు చేసి విడాకులు తీసుకుంది రాఖీ సావంత్. అటు తర్వాత తనకంటే చిన్నవాడైన ఆదిల్ ను ప్రేమించి.. కొన్నాళ్ళు సహజీవనం చేసి పెళ్లి చేసుకుంది. కానీ అతనితో కూడా విడిపోయింది. ఇప్పుడు విడాకులు మంజూరు కావడంతో పార్టీ చేసుకుంటూ దిగిన ఫోటోలను షేర్ చేసింది.