Kartik Aaryan: హీరో కార్తిక్ ఆర్యన్ చేసిన పనికి ఫిదా అవుతున్న అభిమానులు!

సినీ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉంటారు . కానీ ఎవ్వరు కూడా హీరోయిన్ కి ఏ విషయంలో హెల్ప్ చేయరు. సినిమా చేసే టైం వరకు ఒకలా ఉంటారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయి ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ హీరోయిన్ పేరుని కూడా మర్చిపోతారు . అలాంటి హీరోలు మన ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారు . అవసరానికి వాడుకుని వదిలేసి సినిమా స్టార్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .

అయితే వాళ్లందరిలోకి డిఫరెంట్ మైండ్ సెట్ కలవాడు హీరో (Kartik Aaryan) కార్తిక్ ఆర్యన్. అందుకే అందరి ముందు తన తోటి హీరోయిన్ కియారా చెప్పులు అందించి అందరిని ఆకర్షించాడు. ఈ బాలీవుడ్ స్టార్ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతుంటాడు. అయితే కార్తిక్ తాను సినిమాలు చేసే టైంలో సినిమాలో హీరోయిన్స్ పట్ల చాలా కేరింగ్ గా ఉంటాడని సరదాగా మాట్లాడుతూ ఉంటాడని అందరూ చెప్పుకొస్తారు.

అంతేకాదు ఆయన లిమిట్స్ లో ఆయన ఉంటూనే ఎదుటి వాళ్ళ ప్రాబ్లంను అర్థం చేసుకునే మంచి మనసున్న వ్యక్తి కార్తిక్ అంటూ చాలామంది హీరోయిన్స్ చెప్పుకొచ్చారు . బాలీవుడ్‌లో కార్తీక్‌ ఆర్యన్‌, కియారా అద్వానీది సక్సెస్‌ఫుల్‌ జోడి. ఈ జంట గతంలో కలిసి నటించిన ‘భూల్‌ భులయ్యా 2’ ఘన విజయాన్ని సాధించింది. వీరు హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన కొత్త సినిమా ‘సత్యప్రేమ్‌కి కథ’. ఈ సినిమా ఈవెంట్ తాజాగా ముంబయిలో జరిగింది.

అందులో ఈ ఇద్దరూ డ్యాన్స్ చేశారు. అయితే, ఆమె హైహిల్స్‌ వేసుకుని ఉండటంతో వాటిని విప్పి పక్కకు పడేశారు. డ్యాన్స్‌ చేయటం అయిపోయిన తర్వాత కార్తీక్‌ ఆమెకు సహాయం చేశారు. స్వయంగా తన చేత్తో చెప్పుల్ని ఆమెకు అందించారు. ఆమె వాటిని ధరించి కార్తీక్‌తో పాటు స్టేజీ దిగేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus