బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, నిర్మాతగా, మోడల్ గా జుహీ చావ్లా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపును కలిగి ఉన్న ఈ నటి కూతురి పుట్టినరోజు సందర్భంగా చేసిన పని ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. కూతురి పుట్టినరోజున ఏకంగా 1000 మొక్కలు నటి ఈ నటి నెటిజన్ల చేత హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నారు. జూహీ చావ్లా కూతురు పేరు జాహ్నవి కాగా జాహ్నవి 23వ పుట్టినరోజు ఆమెకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని జుహీ చావ్లా భావించారు.
రొటీన్ కు భిన్నంగా వినూత్నంగా ఏదైనా చేయాలని భావించిన జుహీ చావ్లా 1000 మొక్కలు నాటడం వెనుక అసలు కారణాలను సైతం బయటపెట్టారు. నేను ఎంతగానో ప్రేమించిన నా కూతురు పుట్టినరోజు కావడంతో 1000 మొక్కలు నాటానని ఆమె కామెంట్లు చేశారు. నా కూతురు, ఆమె తరం స్వచ్చమైన గాలిని పీల్చుకోవాలని నేను భావిస్తానని జుహీ చావ్లా చెప్పుకొచ్చారు.
సీతాకోకచిలుకలు, ఉడతలు, పక్షులు సైతం ప్రశాంతమైన జీవనం సాగించాలని నేను ఫీలవుతానని ఆమె కామెంట్లు చేశారు. హ్యాపీ బర్త్ డే డియర్ జాహ్నవి అంటూ జుహీ చావ్లా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జుహీచావ్లా (Juhi Chawla) చేసిన పనిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇతర సెలబ్రిటీలు సైతం మొక్కలు నాటడం తరహా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అభిమానులలో స్పూర్తి నింపిన వాళ్లు అవుతారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జుహీ చావ్లా కూతురు అయినప్పటికీ జాహ్నవి మాత్రం రైటర్ గా కెరీర్ ను కొనసాగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రైటర్ గా కెరీర్ ను ఎంచుకున్న జాహ్నవి కెరీర్ పరంగా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.