అతనొక మిడ్ రేంజ్ హీరో. పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ అతనికి ఇంకా స్టార్ ఇమేజ్ దక్కలేదు. మిడ్ రేంజ్ హీరో అనే ఇమేజ్ ను కాపాడుకోవడానికి కూడా అతను చాలా కష్టపడ్డాడు. సారీ సారీ.. ఆ ఇమేజ్ ను మెయింటైన్ చేయడానికి ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాడు. అలా అని అతనికి హిట్లు లేవా? అంటే కాదు. ఎందుకు లేవు..? 4 ,5 హిట్లు ఉన్నాయి. ప్లాప్ అయిన సినిమాల్లో కూడా ఒకటి, రెండు.. బాగానే ఉంటాయి.
వాటి బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉన్నా.. ‘నటుడిగా అతన్ని ఇంకో మెట్టు పైకి ఎక్కించడానికి కానీ, మంచి టేస్ట్ ఉన్న హీరో’ అని చెప్పుకోవడానికి కానీ అవి ఉపయోగ పడ్డాయి. మరి ఇంకేంటి సమస్య.. అంటే అతని కెరీర్లో ఉన్న హిట్ సినిమాలకి మాత్రం అతనికి మేజర్ క్రెడిట్ దక్కలేదు. అతని మొదటి హిట్ సినిమాకి హీరోయిన్ క్రెడిట్ అన్నారు. అటు తర్వాత వచ్చిన హిట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ ఎక్కువ మార్కులు కొట్టేసారు అన్నారు.
ఆ తర్వాత వచ్చిన ఇంకో 3 హిట్లు.. డైరెక్టర్లు, అందులో ఇంకో హీరోలు నటించడంతో వారికి కూడా క్రెడిట్ వెళ్ళిపోయింది. సరే.. అన్నీ ఎలా ఉన్నా.. ఈ మిడ్ రేంజ్ హీరో సినిమాలకి నెగిటివ్ టాక్ వస్తే మినిమమ్ ఓపెనింగ్స్ అయినా వస్తున్నాయా? అంటే..అబ్బే, రావడం లేదు. ఎందుకంటే ఇతనికంటూ లాయల్ ఫ్యాన్స్ లేరు.’దాని గురించి ఏమైనా అసంతృప్తి ఉందా?’ అని ప్రశ్నిస్తే ఇతను ఓ రేంజ్లో మండిపడ్డాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై అతన్ని ప్రశ్నించగా..
అతను (Hero) ఆగ్రహంతో ఊగిపోయి తన కోపాన్ని యాంకర్ పై చూపించాడట. పైకి సాఫ్ట్ గా కనిపించే ఈ హీరో కోపం చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా షాకైనట్టు సమాచారం. ‘మార్కెట్ ఉంది, నాకు మంచి టేస్ట్ ఉంది’ అని ప్రయోగాత్మక సినిమాలు చేసి జనాల పై వదిలేస్తామంటే.. వాళ్ళు మాత్రం ఎందుకు చూస్తారు? సినిమా అనేది బిజినెస్ కోసం, తమ ఇష్టం కోసం మాత్రమే కాదు.., ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ పంచడానికి చేయాలి అని అతను ఎప్పుడు గ్రహిస్తాడో ఏమో..!