నిర్మాత అసలు బుద్ధి ఏంటో బయటపెట్టిన హీరోయిన్..!

కాస్టింగ్ కౌచ్ .. కొత్తగా వింటున్న మాట కాదు. నిత్యం వింటూనే ఉన్న మాట. షూటింగ్ టైంలో హీరోయిన్లు ఎదుర్కొన్న ఇబ్బందులను వారు పాల్గొన్న పలు ఇంటర్వ్యూల ద్వారా బయటపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏ హీరోయినూ కూడా నటిగా బిజీగా ఉన్న టైంలో అలాంటి విషయాలు బయట పెట్టడం లేదు. అవకాశాలు తక్కువైనప్పుడో, ఫేడౌట్ అయిపోయినప్పుడో.. ఈ విషయం పై స్పందిస్తున్నారు. అందువల్ల..జనాలు వీటిని సీరియస్ గా తీసుకోవడం లేదు.

కాబట్టి 4 రోజులు మాత్రమే ఇవి వైరల్ అవుతున్నాయి. తర్వాత అంతా మర్చిపోతున్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవల నగలు దొంగతనం చేసి వార్తల్లో నిలిచిన నటి సౌమ్య శెట్టి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె ఇటీవల అరెస్ట్ అవ్వడం వల్ల.. ఈమెకి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో గతంలో ఈమె ఓ సినిమా షూటింగ్లో ఉన్న టైంలో డ్రెస్ ఛేంజ్ కోసం వెళితే.. ఆమె వెనుకే నిర్మాత వచ్చి, ఘోరంగా ప్రవర్తించాడట.

ఆ సినిమా కంప్లీట్ అయ్యేవరకు అలాగే వేధించేవాడని, అప్పుడప్పుడు చెయ్యి చేసుకునేవాడని కూడా ఈ సందర్భంగా ఆమె తెలియజేసింది. సినిమా పరిశ్రమలో తక్కువ టైంలోనే ఇలాంటి ఎన్నో ఘోరమైన అనుభవాలు ఎదురైనట్టు సౌమ్య శెట్టి చెప్పుకొచ్చింది. ‘ద ట్రిప్‌’ ‘యు వర్స్‌ లవింగ్లీ’ వంటి సినిమాల్లో సౌమ్య శెట్టి నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆమె (Sowmya Shetty) ఒడిశా, సుజాతానగర్‌ కు చెందిన బలరాం శెట్టిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus