‘బుజ్జిగాడు’ సినిమాతో ఫేమ్ సంపాదించిన నటి సంజన గల్రాని సోదరి నిక్కీ గల్రాని కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన నటన, క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ‘డార్లింగ్’, ‘వెలయిన్ను వందుట్టా వెల్లైక్కారన్’, ‘కడవుల్ ఇరుక్కన్ కుమారు’, ‘మొట్ట శివ కెట్ట శివ’, ‘హరహర మహాదేవకి’, ‘మరగత నానయం’ వంటి తమిళ చిత్రాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది.
ఇదిలా ఉండగా.. జనవరి 11న నిక్కీ తన దగ్గర పనిచేసే 19 ఏళ్ల ఓ కుర్రాడు ధనుష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై రాయపేటలోని నిక్కీ గల్రాని ఇంట్లో పని చేస్తున్నాడు ధనుష్. అయితే నిక్కీకి చెందిన ఖరీదైన బట్టలు, కెమెరా కనిపించలేదు. ఈ సంఘటన తరువాత ధనుష్ పరారీలో ఉండడంతో అతడే దొంగతనం చేసినట్లుగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ధనుష్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు ధనుష్ తిరుపూర్ లోని తన స్నేహితుడి ఇంట్లో దాక్కున్నట్లుగా గుర్తించారు. సోమవారం తిరుపూర్ లో అతడిని అరెస్ట్ చేసి.. దొంగతనం చేసిన వస్తువులను స్వాధీనమా చేసుకున్నారు. విచారణ కోసం ధనుష్ ని చెన్నైకి తీసుకొచ్చారు పోలీసులు.
అతడి దగ్గర స్వాధీనం చేసుకున్న వస్తువులను నిక్కీకి అప్పగించారు. దీంతో నిక్కీ తన కంప్లైంట్ ను విత్ డ్రా చేసుకున్నట్లు సమాచారం. ధనుష్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోరిందట నిక్కీ. దొంగతనం చేసిన వస్తువులు లక్షకు పైగా ఖరీదు చేస్తాయని సమాచారం.