సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమని విషాదాలు విడిచి పెట్టడం లేదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే.. నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్,హాలీవుడ్ నటి లొరెట్టా స్విట్, తమిళ నటుడు విక్రమ్ సుకుమారన్, వైభవ్ కుమార్ సింగ్, షైన్‌ టామ్‌ చాకో తండ్రి సీపీ చాకో వంటి వారు మృతి చెందారు.

Vijaya Bhanu

ఇంతలోనే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిన్నటి తరం నటి విజయ భాను (Vijaya Bhanu) కన్నుమూశారు. అమెరికాలో స్థిరపడిన ఈమె గత నెలలో ఇండియాకు వచ్చారు. చెన్నైలోని తన ఇంటిని చూసుకునేందుకు వెళ్లిన విజయభాను… ఎండ వేడి తట్టుకోలేక వడదెబ్బకు లోనై… అర్ధాంతరంగా ప్రాణం విడిచింది. ఈమె మృతి పట్ల చింతిస్తూ సీనియర్లు జయప్రద, సుమన్, వై.వి.ఎస్.చౌదరి తదితరులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు!

తమిళ, కన్నడ, హిందీ భాషల్లోని సినిమాల్లో కూడా నటించింది విజయభాను (Vijaya Bhanu) .70వ దశకంలో అగ్ర కథానాయకులందరి సినిమాల్లోనూ విజయభాను కీలక పాత్రలు పోషించింది. అప్పట్లో రాజబాబు – విజయభాను..ల జంటకు క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. చిరంజీవి, కమల్ హాసన్, జయసుధలతో అగ్ర దర్శకులు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘ఇది కథ కాదు’ లో కూడా విజయభాను కీలక పాత్ర పోషించింది. ఆ చిత్రంలో తన నటనకు గాను ‘ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం అందుకుంది.

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus