విడాకులు తీసుకున్న మరో టెలివిజన్ కపుల్స్!

ఇటీవల కాలంలో సెలబ్రిటీలలో చాలా బాగుంది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే గత ఏడాది అమీర్ ఖాన్ కిరణ్ రాజు నాగ చైతన్య సమంత లో కూడా వారి బంధాలను తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే అంతేకాకుండా కొంతమంది టెలివిజన్ నటి నటులు కూడా గత ఏడాది కూడా తీసుకున్నారు. ఇక ఈ ఏడాది మొట్టమొదటిసారిగా విడాకులు తీసుకున్న జంట లిస్టులో మరో టెలివిజన్ ప్రముఖులు నిలిచారు. టెలివిజన్‌ రంగంలో బ్యూటీఫుల్ కపుల్స్ గా మంచి క్రేజ్ అందుకున్న అమీర్‌ అలీ- సంజీదా షేక్‌ విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా వివరణ ఇచ్చారు.

పలు సీరియల్స్ తో అలాగే రియాలిటీ షోలతో ఎక్కువగా కనిపించిన ఈ జంట హఠాత్తుగా విడిపోతున్నట్లు చెప్పడంతో సోషల్ మీడియాలో ఉరల్ గా మారింది. 9ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ఈ స్టార్ కపుల్స్ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. గత ఏడాదిలోనే ఈ ఇద్దరు కూడా వేరువేరుగా ఉంటున్నట్లు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక వార్తలు ఎన్ని వచ్చినా కూడా పెద్దగా స్పందించని అమీర్‌ అలీ- సంజీదా షేక్‌ ఫైనల్ గా విడాకులు తీసుకున్నట్లు తేల్చేశారు.

ఇక వారి వ్యక్తిగత జీవితం గురించి బయట చెప్పుకోవాడనికి ఏ మాత్రం ఇష్ట పడటం లేదని ఈ జంట కూల్ గానే క్లారిటీ ఇచ్చేసింది. 2012 లో ప్రేమ వివాహం చేసుకున్న అమీర్‌ అలీ- సంజీదా షేక్‌ ప్రముఖ రియాలిటీ షో నచ్‌ బలియే-3లో పాల్గొని విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక వీరు ఎప్పుడు బాహ్య ప్రపంచంలో కనిపించినా కూడా చాలా అన్నోన్యతో ఉన్నట్లు కనిపించే వారు.

ఇక 2020లో సరోగసి ద్వారా ఐరా అనే పండంటి బిడ్డకు వీరు జన్మనిచ్చారు. ఇక ఆ పాప బాధ్యతను సంజీదా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సంజీదా కొన్ని ప్రముఖ వెబ్ సీరిస్ లతో బిజీగా ఉన్నట్లు సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus