ఆస్పత్రి బిల్లు రూ.7 లక్షలు.. హీరోలు సాయం చేస్తారా..?

  • May 6, 2021 / 03:00 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు ఒక్కోసినిమాకు 10 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లలో చాలామంది సందేశాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. మరి సినిమాల ద్వారా సందేశాలు ఇచ్చే హీరోలు, దర్శకులు ప్రస్తుతం ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న దర్శకుడు నంద్యాల రవిని ఆదుకుంటారో లేదో చూడాల్సి నుంది. నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్మీ రావే మాఇంటికి సినిమాతో నంద్యాల రవి దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.

ఆ సినిమా సక్సెస్ సాధించకపోవడంతో కొన్నేళ్ల పాటు నంద్యాల రవికి పెద్దగా అవకాశాలు రాలేదు. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో దర్శకునిగా గుర్తింపు సంపాదించుకున్న విజయ కుమార్ కొండా డైరెక్షన్ లో తెరకెక్కిన రెండు సినిమాలకు నంద్యాల రవి రచయితగా పని చేశారు. అయితే ఈ డైరెక్టర్ తాజాగా కరోనా బారిన పడగా వైరస్ నుంచి కోలుకుంటున్నారు. వైద్యానికి ఆస్పత్రి ఏకంగా 7 లక్షల రూపాయల బిల్లు వేసింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న రవి ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు తమ వంతు సాయం చేసి నంద్యాల రవిని సమస్య నుంచి గట్టెక్కించాలని నెటిజన్లు కోరుతున్నారు. కరోనా సోకి ఇలా ఇబ్బందులు పడుతున్న సినిమా రంగానికి చెందిన వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందని సమాచారం. సెలబ్రిటీలు తమ వంతు సహాయం చేసి గొప్ప మనస్సును చాటుకుంటారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus