డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో ప్రముఖ హీరో!

మన హీరోలు మనకు హితబోధ చెయ్యాలంటే చాలా సూక్తులే చెప్తారు…కానీ వల్ల విషయానికి వచ్చేసరికి మాత్రం అడ్డంగా దొరికేస్తారు…ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే, ఒక ప్రముఖ తమిళ హీరో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు…కారు ఆక్సిడెంట్ అవ్వడం వల్ల, చిన్న పాటి గాయాలతో బయటపడ్డాడు…అదృష్టవశాత్తూ హీరో క్షేమమే అనుకోండీ…ఇంతకీ ఎవరు ఆ హీరో ఏమా కధ అంటే, ప్రముఖ తమిళ హీరో జై గుర్తున్నాడా? జర్నీ సినిమాలో అమాయకంగా నటిస్తూ హీరోయిన్ చేతుల్లో ఆట బొమ్మలా ఉంటాడే తనే…ఆ హీరోనే ఈ నిర్వాకం చేసింది…వివరాల్ళోకి వెళితే….ఓ పార్టీలో పాల్గొన్న జై తర్వాత ఇంద్రానగర్‌లోని తన ఇంటికి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు.

మద్యం మత్తులోవున్న జై.. మార్గమధ్యలో అద్యార్ ఫ్లైఓవర్ దగ్గర డివైడర్‌కి కారు ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తన ఆడి కారుకి బాగానే డ్యామేజ్ అయ్యింది. జై కి కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి. పోలీసులు అతడిపై రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు ఈ నటుడు. అయితే జై మరియు మన అందాల భామ అంజలి ఘాడమైన ప్రేమలో ఉన్నారు…వీళ్ళిద్దరూ తమ కరియర్ స్టార్ట్ అయిన సమయం నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నప్పటికీ, ఈ మధ్యే పూర్తిగా ఓపెన్ అయ్యారు…ప్రస్తుతం ఇద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటూ…. బాగా సెటిలైన తర్వాత పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అదన్న మాట మ్యాటరు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus