స్టార్‌ హీరో సంచలన వ్యాఖ్యలు

సినిమాల నుండి రాజకీయాల్లోకి నటులు రావడం కొత్త విషయమేమీ కాదు. అలా ఇప్పటివరకు చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. కొంతమంది విజయం సాధించి ప్రజల్ని పాలించారు. ఇంకొంతమంది రాజకీయాలు తమకు సరిపడవని వెనక్కి వెళ్లిపోయారు. వాళ్ల సంగతి పక్కనపెడితే… రాజకీయాల్లో ఉండి చాలామంది ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో ఒకరు హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ స్కార్వ్జ్‌నెగర్‌. ఇంత సాధించిన ఆయన పిల్లల మనసులు గెలుచుకోలేకపోయారట తెలుసా. ‘టెర్మినేటర్​’ లాంటి భారీ యాక్షన్ సినిమా సిరీస్​తో ఆర్నాల్డ్​ ష్వార్జ్​నెగర్​ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 2003 నుండి 2011 వరకు యూఎస్‌లోని కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నర్​గా పనిచేశారు. అయితే తాను రాజకీయాల్లోకి వచ్చిన, గవర్నర్​గా పనిచేయడం తన పిల్లలు కేథరిన్​, పాట్రిక్​, క్రిస్టోఫర్​, క్రిస్టినాకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు ఆర్నాల్డ్‌. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ పదవిలో ఉన్నంత కాలం తనను పిల్లలు అసహ్యించుకున్నారని వెల్లడించారు. కాలిఫోర్నియా గవర్నర్​ అయిన తర్వాత తన పిల్లలు తనను చూసి గర్వపడతారని ఆర్నాల్డ్‌ అనుకున్నారట.

కానీ వాళ్లు భిన్నంగా వారు స్పందించారట. షూటింగ్​ సెట్స్​కు అలవాటు పడిన తన పిల్లలు తనను ఇలా రాజకీయాల్లో చూడలేకపోయారేమో అన్నారు ఆర్నాల్డ్‌. నటన నుండి రాజకీయాల్లోకి ఎందుకొచ్చావని తరచూ అడిగేవారట. గవర్నర్​గా ఉన్నప్పుడు ఉరుకుల పరుగుల జీవితం ఉండేది. దీంతో పిల్లలతో గడిపే సమయం ఉండేది కాదట. అయితే ఆ సయమంలో ఆర్నాల్డ్‌కు ఆయన భార్య మద్దతుగా నిలిచారట.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus