సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. వనిత విజయ్ కుమార్ మాజీ భర్త పీటర్ పాల్ అలాగే ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య, సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడి కొడుకు వంటి వారు ఇటీవల మరణించారు. తాజాగా మరో స్టార్ హీరో తండ్రి కూడా కన్నుమూయడం సినీ పరిశ్రమలో విషాదాలు ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తండ్రి అలాగే ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వీరేంద్ర ఖురానా అలియాస్ పి.ఖురానా శుక్రవారం ఉదయం మరణించారు.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో మెరుగైన చికిత్స కోసం జాయిన్ అయ్యారట. ఫోర్టిస్ ఆసుపత్రిలో జాయిన్ అయిన పి.ఖురానాని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించడం జరిగింది.కానీ ఆయన కోలుకోలేదు. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఆయన మరణ వార్తతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి అని చెప్పాలి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు మణిమజ్ర శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.
ఈ క్రమంలో పి.ఖురానా ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. పి.ఖురానా కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయుష్మాన్ సోదరుడు అపర్శక్తి ఖురానా కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానాకి తన తండ్రి అంటే చాలా ఇష్టం.తన (Star Hero) సోషల్ మీడియా ఖాతాలో ఎక్కువగా తన తండ్రి ఫోటోలను షేర్ చేస్తుండేవాడు.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!