తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్నేహానికి ప్రతిరూపం లాగా నిలిచిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్. ‘జల్సా’ సినిమాతో ప్రారంభమైన వీళ్లిద్దరి స్నేహం, ఇప్పుడు ఏ స్థాయికి చేరిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వీళ్ళిద్దరిని స్నేహితులు అనడం కంటే సోదరులు అనడం సబబు. అంత గొప్ప సాన్నిహిత్యం వీళ్ళిద్దరిది. జల్సా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.
ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ రెండు సినిమాల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు కానీ, పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలు భీమ్లా నాయక్ మరియు బ్రో లకు కథ , స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించాడు. అంతే కాదు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలను సెట్ చేసింది కూడా త్రివిక్రమే.
తన సినిమాలను కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగత మ్యానేజర్ లాగ వ్యవహరించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కి ఏ డైరెక్టర్ అయినా కలిసి స్టోరీ వినిపించాలంటే ముందుగా త్రివిక్రమ్ వినాల్సిందే. ఇప్పుడు అభిమానులు ఎంతో గర్వం గా భావిస్తున్న ‘ఓజీ’ చిత్రాన్ని సెట్ చేయించింది కూడా త్రివిక్రమే అట.
అలా రాజకీయాల్లో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ కి సినిమాలు సెట్ చేసే విషయం లో (Trivikram) త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్న శ్రద్ద తన సొంత సినిమాలకు కూడా తీసుకోలేదు అని చెప్పాలి. తన పట్ల ఇంత ప్రేమ, శ్రద్ద చూపిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ నేడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా బంజారా హిల్స్ లో ఆరు కోట్ల రూపాయిలు విలువ చేసే అందమైన ఇల్లు ని బహుమతిగా ఇచ్చాడట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!