యంగ్ డైరెక్టర్ కు వరుసగా మూడో ఛాన్స్ ఇచ్చేశాడట..!

ఓ స్టార్ హీరోతో ఓ యంగ్ డైరెక్టర్ సినిమా చేసి హిట్టు అందిస్తే చాలు.. ఆ హీరో అభిమానులు మళ్ళీ మళ్ళీ ఆ యంగ్ డైరెక్టర్ తో తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అయితే కొంతమంది స్టార్ హీరోలకు డైరెక్టర్ల పనితనం నచ్చితే వారికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇచ్చేస్తుంటారు. ఈ విషయంలో మాత్రం మనం అజిత్ నే ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి.

తెలుగులో ‘శౌర్యం’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శివ.. అటు తరువాత కోలీవుడ్లో ‘సిరుతై’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. మన ‘విక్రమార్కుడు’ సినిమాకి అది రీమేక్. ఆ సినిమా హిట్ అయితే తరువాత ఇతనికి అజిత్ తో ‘వీరం’ అనే సినిమాని తెరకెక్కించే అవకాశం దక్కింది. దానిని పూర్తిగా సద్వినియోగ పరచుకుని ‘వీరం’ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతే ఈ డైరెక్టర్ పనితనానికి ఫ్లాట్ అయిపోయిన అజిత్ వరుసగా.. అతనితో ‘వేదాళం’ ‘వివేకం’ ‘విశ్వాసం’ వంటి సినిమాలు చేసాడు.

అటు తరువాత ‘ఖాకీ’ ఫేమ్ హెచ్.వినోద్ తో ‘నెర్కొండ పార్వే'(‘పింక్’ రీమేక్లో నటించాడు) చిత్రాన్ని చేసాడు. దీనిని అతను 45 రోజుల్లోనే ఫినిష్ చేసేసాడు. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. మళ్ళీ వెంటనే అతనితో ‘వాలిమై’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను చెయ్యడానికి రెడీ అయిపోయాడు అజిత్. ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తికాకుండానే… ఈ హెచ్.వినోద్తో మరో సినిమా చేయడానికి కూడా ఓకే చెప్పేశాడట. 2022 ఆరంభంలో ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుందని వినికిడి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus