మరో ఆన్ స్క్రీన్ పెయిర్.. పెళ్లిపీటలెక్కనుందా?

సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించిన వాళ్ళు నిజ జీవితంలో పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు.. మరి కొంతమంది విడాకుల బాట పట్టారు. ఏదేమైనా అలా పెళ్లి చేసుకున్న జంటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంటుంది. పెళ్లయ్యాక వీళ్ళు కలిసి సినిమాలు చేశారు అంటే.. ఆ సినిమాపై క్రేజ్ పెరగడం కూడా గ్యారెంటీ. అలా బ్లాక్ బస్టర్ లు కొట్టిన ఆన్-స్క్రీన్ పెయిర్ లు, నిజ జీవితంలో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.

టాలీవుడ్‌లో చూసుకుంటే కృష్ణ- విజయ నిర్మల, నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ,మహేష్ బాబు – నమ్రత వంటి జంటలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయి. సమంత – నాగ చైతన్య లు విడాకులు తీసుకుని సెపరేట్ అయ్యారు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి అసలు విషయానికి వచ్చేద్దాం. టాలీవుడ్ 3,4 సినిమాలతో ఫేమస్ అయిన ఓ యువ హీరో యువ హీరోయిన్ ప్రస్తుతం సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నారట. ఛాన్స్ దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకుని హ్యాపీగా తిరిగేస్తున్నారు.

ఈ యువ హీరో, హీరోయిన్ కలిసి నటించిన సినిమా కరోనా టైంలో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై సక్సెస్ అందుకుంది. అటు తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కూడా ఈ జంట కలిసి ఫోటోలకు చిక్కింది. అయితే ఈ యంగ్ హీరో, హీరోయిన్లు ఇంకా సరైన సక్సెస్ అందుకోలేదు. మంచి బ్రేక్ కోసం ఇద్దరూ ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో వీరు పెళ్లి చేసుకుని ఒకటవుతారా? అంటే కచ్చితంగా చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే డేటింగ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus