బాలకృష్ణ ఆ హీరో మధ్య బయటపడ్డ మనస్పర్ధలు..!

  • November 14, 2023 / 04:02 PM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిన్నటి తరం హీరోలలో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ దగ్గర నుండి ఫ్యాన్ బేస్ వరకు నువ్వా నేనా అనే రేంజ్ పోటీని ఇచ్చిన టాప్ 2 హీరోలు ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరు హీరోల గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఇరువురి హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియా లో మరియు బయట తరచూ జరుగుతూనే ఉంటాయి.

కనీసం హీరోలైన స్నేహం గా ఉంటారా అంటే , ఎదో స్నేహం గా ఉన్నట్టు అనిపిస్తారు కానీ, ఇద్దరి మధ్య చాలా మనస్పర్థలు ఉన్నాయనే విషయం రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే అర్థం అవుతుంది. బాలయ్య చిరంజీవి పై పలుమార్లు పరోక్షంగా సెటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే బాలయ్య బాబు ఆహా మీడియా లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరించి ఆ ప్రోగ్రాం ని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని చేసాడో మన అందరికీ తెలిసిందే.

రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు మూడవ సీజన్ చిన్న లిమిటెడ్ వెర్షన్ ని జరుపుకుంటుంది. ఈ లిమిటెడ్ వెర్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేస్తాడు అని బలంగా టాక్ వినిపించింది. ఆహా మీడియా వారు చిరంజీవి సంప్రదించారు, (Balakrishna) బాలయ్య బాబు కూడా చిరంజీవి ని ప్రత్యేకించి ఆహ్వానించారు.

కానీ చిరంజీవి మాత్రం ఈ టాక్ షో లో పాల్గొనడానికి ఇష్టం లేదంటూ సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. చూస్తూ ఉంటే బాలయ్య బాబు గతం లో చిరంజీవి మీద పరోక్షంగా చేసిన కామెంట్స్ ని చిరు తన మనసులోకి బలంగా తీసుకున్నాడు అనే విషయం అర్థం అవుతుంది. వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఈ సంఘటనతో మరింత దృఢపడింది అని చెప్పొచ్చు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus