జగన్ రోల్ స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఈ ఏడాది థియేటర్లలో విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో సీతారామం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. యాత్ర2 సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటించనున్నారని తెలుస్తోంది. 2024 ఎన్నికల నేపథ్యంలో జగన్ గురించి పాజిటివ్ గా యాత్ర2 సినిమాను తెరకెక్కించనున్నారని బోగట్టా. మహి వి రాఘవ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా సీఎం జగన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించనున్నారని తెలిసి అందరూ షాకవుతున్నారు.

అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఎదురైన పరిస్థితులు ఆ పరిస్థితులను జగన్ ఎదుర్కొన్న తీరును ప్రధానంగా ఈ సినిమాలో చూపించనున్నారని సమాచారం అందుతోంది. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ కు దుల్కర్ సల్మాన్ సైతం ఓకే చెప్పారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీకి అనుకూలంగా వరుస సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కుతుండటం గమనార్హం. మహి వి రాఘవ ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలను తెరకెక్కిస్తుండటం గమనార్హం.

మహి వి రాఘవ మంచి సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో ఉన్న సంగతి తెలిసిందే. యాత్ర2 సినిమాకు నిర్మాత ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. జగన్ కు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి కూడా ఈ సినిమాలో ప్రస్తావించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలు వైసీపీకి ప్లస్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. యాత్ర సినిమాలో మమ్ముట్టి నటించగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటిస్తుండటం గమనార్హం.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు దుల్కర్ సల్మాన్ పారితోషికం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. దుల్కర్ సల్మాన్ కు కూడా క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus