సర్కారు వారి పాట మూవీలో మహేష్ కోసం క్రేజీ విలన్!

హిట్ ట్రాక్ లో దూసుకువెళుతున్న మహేష్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలున్నాయి. చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసింది. అప్పటి వరకు దర్శకుడు పరుశురామ్ ని లైట్ గా తీసుకున్న ఫ్యాన్స్ సర్కారు వారి పాట చిత్రంలో ఎదో కొత్తగా చెప్పబోతున్నాడని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ మూవీ కథా, నేపథ్యంపై ఇప్పటికే అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా, మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో సుధీప్ ని తీసుకున్నారట. కథలో విలన్ కి చాలా ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో సుధీప్ బెటర్ ఆప్షన్ అని భావించి, ఆయన్ని సంప్రదించగా ఆయన ఒకే కూడా చెప్పారని సమాచారం వస్తుంది. ఇక ఇప్పటికే అనేక సినిమాలలో విలన్ గా చేసిన సుధీప్ గత ఏడాది విడుదలైన దబంగ్ 3లో కూడా విలన్ గా చేశారు. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో ఆయన విలన్ రోల్ చేయడం జరిగింది. ఇక మహేష్ కి విలన్ గా సుధీప్ చేస్తే పర్ఫెక్ట్ హీరోయిజం పండుతుంది.

హీరో విలన్ మధ్య పోరు ఓ రేంజ్ లో ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ బాగా ప్రచారం అవుతుంది. కాగా మహేష్ ఈ మూవీలో మనీ లెండర్ గా కనిపిస్తాడని, సినిమా మొత్తం గోవా నేపథ్యంలో నడుస్తుందని టాక్. ఏది ఏమైనా పరుశురాం ఓ సరికొత్త మహేష్ ని పరిచయం చేయనున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ సెట్స్ పైకి వెళ్లనుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus