నాని,వెంకీ,రానా సినిమాలకు కూడా అదే ప్రాబ్లమ్ వచ్చిపడిందట..!

  • February 3, 2021 / 06:18 PM IST

కరోనా లాక్ డౌన్ కారణంగా గతేడాది షూటింగ్లు ఆగిపోవడం, థియేటర్లు కూడా మూత పడడంతో విడుదలకు ముస్తాబయిన సినిమాలు కూడా ఆగిపోయాయి.. దాంతో ఈ ఏడాది జాగ్రత్త వహించాలని దర్శకనిర్మాతలు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 25 నుండీ థియేటర్లు తెరుచుకోవడం మీడియం రేంజ్ సినిమాలు విడుదలయ్యి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో.. తమిళ డబ్బింగ్ సినిమా ‘మాస్టర్’ కారణంగా థియేటర్ల అడ్జస్ట్మెంట్ల గురించి గొడవ కూడా జరిగింది.

ఈ నేపథ్యంలో ఇలాంటి గొడవలు మనకెందుకు వచ్చినవిలే అనుకున్నారేమో మన దర్శకనిర్మాతలు.. వరుస పెట్టి వారి సినిమాల విడుదల తేదీలను ప్రకటించేసారు. ఈ నేపథ్యంలో ఒక సినిమా యూనిట్ సభ్యులు మరో సినిమా యూనిట్ సభ్యులను సంప్రదించలేదు అనుకుంట.. కొన్ని క్లాష్ లు కూడా ఏర్పడే పరిస్థితి కనిపించింది. దాంతో ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్లను మార్చే పనిలో పడ్డారట దర్శకనిర్మాతలు. ఏప్రిల్ 16న ‘టక్ జగదీష్’ రిలీజ్ డేట్ ప్రకటించగా అదే రోజున ‘లవ్ స్టోరి’ కూడా విడుదలవ్వబోతున్నట్టు ప్రకటించారు.

దాంతో నాని అండ్ టీం తమ సినిమాని ఏప్రిల్ 23కి వాయిదా వేసుకున్నారట.మరోవైపు మే 14న ‘నారప్ప’ వస్తున్నట్టు ప్రకటిస్తే మే 13నే ‘ఆచార్య’ కూడా విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు.‘ఆచార్య’తో పోటీ అంటే ‘నారప్ప’ డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారట. కాబట్టి ఆ సినిమా రిలీజ్ డేట్ ను కూడా మార్చే అవకాశం గట్టిగా ఉందని తెలుస్తుంది.ఇక ఏప్రిల్ 2న ప్రకటించిన ‘సీటీ మార్’, ఏప్రిల్ 30కి ప్రకటించిన ‘విరాటపర్వం’ డేట్ లు కూడా మారే అవకాశం పుష్కలంగా ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus