‘సైంధవ్’ లో హీరోయిన్ గా ఆ స్టార్ హీరోయిన్ ఫిక్సట!

  • March 14, 2023 / 06:11 PM IST

విక్టరీ వెంకటేష్ కొంత గ్యాప్ తర్వాత ‘సైంధవ్’ అనే మూవీ చేయడానికి రెడీ అయ్యారు. ‘హిట్’ ‘హిట్2’ చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయిన శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకుడు. ఇది కంప్లీట్ గా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనుంది. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. సిటీ ఔట్ స్కర్ట్స్ లో ఈ మూవీ కోసం ఓ భారీ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కె.జి.ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి, సాయి పల్లవి లను సంప్రదించారు.

కానీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టులో భాగం కాలేకపోయారు. దీంతో ‘జెర్సీ’ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ను ఫైనల్ చేసినట్లు తాజా సమాచారం. అవును తన పాత్ర నచ్చడంతో ఆమె వెంటనే ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేయడం జరిగిందట. అయితే ‘సైంధవ్’ లో హీరోయిన్ తో వెంకీకి ఎటువంటి రొమాంటిక్ ట్రాక్ ఉండదు అని తెలుస్తుంది. శ్రద్దా శ్రీనాథ్ తో పాటు ఈ మూవీలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. కానీ వాళ్ళ పాత్రల నిడివి శ్రద్దా శ్రీనాథ్ కంటే కూడా తక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

కాబట్టి ఓ రకంగా శ్రద్దా శ్రీనాథ్ మెయిన్ హీరోయిన్ అని చెప్పాలి. ఇక వెంకటేష్ కెరీర్లోనే ఈ మూవీ హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందుతుంది. బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ‘సైంధవ్’ లో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన వెంకట్ బోయినపల్లి తన ‘నిహారిక ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus