సామాన్య జనాలకు సినిమానే పెద్ద రిలాక్సేషన్. సినిమానే వినోదం…! రెగ్యులర్ లైఫ్ లో ఏమాత్రం సమయం దొరికినా సినిమా న్యూస్ ల కోసమే జనాలు ఫోన్లు వంక చూస్తారు. హీరో, హీరోయిన్ల గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ పెట్టి హైలెట్ అవ్వాలి. అందరి తాపత్రయం ఇదే. ఇదొక రకమైన స్వయంతృప్తి అనుకోవచ్చు. కానీ ఒక్కోసారి కొంతమంది హద్దులు మీరు హీరో, హీరోయిన్లను పర్సనల్ గా టార్గెట్ చేసి కామెంట్లు చేస్తుంటారు.
ఇలాంటివి ఎక్కువైతే ఆ స్టార్ హీరో, హీరోయిన్లు (Heroine) కూడా పర్సనల్ గా హర్ట్ అవుతారు. పలానా హీరోకి ఆ ఇబ్బంది ఉంది, పలనా హీరోయిన్ కి ఈ ఇబ్బంది ఉంది అంటూ కొంతమంది చేసే కామెంట్లు .. వాళ్ళను బాగా ఇబ్బంది పెడతాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ విషయంలో కూడా ఇదే జరిగింది. కెరీర్ ప్రారంభంలో ఆమె ఎదుర్కొన్న కొన్ని చేదు సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో నాకు చాలా ట్యాగ్లు ఉండేవి. చర్మం నలుపుగా ఉంది, చాలా డార్క్ గా ఉంది అనేవారు. కొంతమంది నేను లావుగా ఉన్నాను అని ఎగతాళి చేశారు. కళ్లజోడు పెట్టుకుంటే.. ‘నిరంతరం కళ్లద్దాలు ధరిస్తుంది.. బహుశా అవి లేకుండా ఈమె ఏమీ చూడలేదేమో ఇంకా చెప్పాలంటే నాకు కళ్ళు కనపడవేమో అంటూ చెప్పుకొచ్చింది. నేనేది మర్చిపోలేదు.. నాకు ప్రతి విషయం గుర్తుంది.
అయినప్పటికీ ఇవన్నీ పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళ్లాను. అలాగే ఇప్పుడు నా గ్లామర్ పెరిగింది అంటున్నారు. ‘నేను ఎలాంటి ఫెయిర్నెస్ క్రీమ్ వాడట్లేదు. స్కిన్ వైటెనింగ్ సర్జరీ కూడా చేసుకోలేదు. గతంలో 10-12 ఏళ్లు విరామం లేకుండా ఎండలో పనిచేశాను. ఇప్పుడు సూర్యుడికి ఎక్స్పోజ్ కావట్లేదు కాబట్టే ఇలా కనిపిస్తున్నాను’ అంటూ కాజోల్ చెప్పుకొచ్చింది.