సాయిధరమ్ తేజ్ మెచ్చిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా  తెరకెక్కిన మూవీ జవాన్. దర్శకుడిగా మారిన రచయిత బివియస్ రవి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ట్రైలర్ తో ఆసక్తి పెంచిన ఈ  చిత్రం డిసెంబర్ 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రదీప్ యాంకర్‌గా ప్రసారం అవుతున్న ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ షోలో పాల్గొన్నారు. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు. ఇందులో డేటింగ్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. ఏ  హీరోయిన్‌ అయినా మిమ్మల్ని డేటింగ్ కి పిలిచారా? అని ప్రదీప్ అడగగా..

అందుకు సాయి ధరమ్ తేజ్  సమాధానం చెబుతూ.. ‘‘ఏ హీరోయిన్ నన్ను డేట్‌కి పిలవలేదు కానీ.. నేనే ఓ హీరోయిన్‌కి అలా ప్రపోజ్ చేశాను. కానీ ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఆ విషయం నా బాయ్ ఫ్రెండ్‌ని అడిగి చెబుతాను అంది..’’ అని చెప్పగానే  ప్రదీప్‌తో పాటు అక్కడున్న వారంతా పగలబడి నవ్వేశారు. ఆ హీరోయిన్ ఎవరంటే ? సాయిధరమ్ తేజ్ ‘తిక్క’ సినిమాలో నటించిన లారిస్సా బోనేసి. అప్పట్లో వీరిద్దరిపై అనేక గాసిప్స్ వచ్చాయి. అప్పుడు ఆ రూమర్లను ఇద్దరూ కొట్టిపడేశారు.  ఇప్పుడు ఆ రూమర్ రావడం వెనుక గల కారణాన్ని సాయి ధరమ్ తేజ్ వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus