డ్రగ్స్ కేసులు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఇటు టాలీవుడ్ లో కెపి చౌదరి ప్రకంపనలు సృష్టిస్తుండగా.. అటు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా డ్రగ్స్ భూతం పట్టిపీడిస్తోంది. ఈక్రమంలోనే కన్నడ సినీ నిర్మాత చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య నమిత పత్తు పదార్థాలకు భానిస కావడంతోపాటు.. అక్రమ సబంధం కూడా నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. అది కూడా తనకు డ్రగ్స్ సరఫరా చేసే డ్రగ్స్ డీలర్ లక్ష్మీశ్ ప్రభు తో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆయన ఆరోపించారు.
అంతే కాదు.. వారిపై బెంగళూరులోని చెన్నమ్మనకేరే అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కన్నడ సినిమాలు నిర్మిస్తూ…పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న టి చంద్రశేఖర్.. రెండేళ్ల క్రితం నమితను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులోని బనశంకరి సెకండ్ స్టేజ్ లో వారు నివాసం ఉంటున్నారు. అయితే తన భార్య మత్తు పదార్థాలకు అలవాటు పడిందని. ఎన్నిసార్లు వద్దని వారించినా.. నిదానంగా చెప్పినా వినలేదన్నారు (Producer) చంద్రశేఖర్.
అంతే కాదు తన కు డ్రగ్స్ సరఫరా చేసే లక్ష్మీశ్ ప్రభుతో అక్రమ సంబంధం పెట్టుకుందని. ఓసారి ఇంట్లో రెడ్ హ్యండెడ్ గా ఇద్దరు దొరికిపోయారన్నారు. మరి ఇదేంటంని ప్రశ్నించినప్పుడు తనపై దాడి చేశారన్నారు చంద్రశేఖర్. కాగా తన భర్త తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చంద్రశేఖర్ భార్య నమిత కూడా తిరిగి కంప్లైంట్ ఇచ్చింది. లక్ష్మీశ్ తనకు స్నేహితుడు మాత్రమే నని. తన స్నేహితుడితో తన భర్త కావాలనే అక్రమ సంబంధం అంటగడుతున్నాడంటోంది నమిత.
తన భర్త స్నేహితులు అరుణ్ , హేమంత్ ఇద్దరు తనపై దాడి చేశారని.. ఇంట్లో కావాలని వారే డ్రగ్స్ పెట్టి నన్ను బెదిరిస్తున్నారంటోంది. పోలీస్టేషన్ లో.. పిర్యాదు చేశారు నమిత. ఇక ఇరువైపులు.. కంప్లైంట్స్ తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!