ధూమ్ 4.. ప్రభాస్ ఒప్పుకుంటాడా?

  • February 23, 2021 / 12:18 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ప్రభాస్ హాట్ టాపిక్ గా మారాడు. బహుబలి అనంతరం ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా మారాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. డేట్స్ లేక ఒప్పుకోవడం లేదు గాని లేకపోతే మరో మూడు సినిమాలు సెట్స్ పైకి వచ్చేవట. ప్రస్తుతం రెబల్ స్టార్ నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక మరో బడా ప్రొడక్షన్ హౌజ్ కూడా ప్రభాస్ కోసం ట్రై చేస్తోందట.

ప్రఖ్యాత యష్ రాజ్ ఫిలిమ్స్ లో సినిమా చేయాలని ఏ హీరోకీ ఉండదు. ఆ సంస్థ నుంచి వచ్చే సినిమాలు కూడా హై లెవెల్లో ఉంటాయి. కేవలం ఆ బ్యానర్ ను చూసి సినిమాకు వచ్చే ఆడియెన్స్ ఎంతో మంది ఉంటారు. ఇక నెక్స్ట్ ఆ సంస్థ ప్రభాస్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ధూమ్ 4 కోసం ప్రభాస్ ను కూడా సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే ధూమ్ 4పై గత ఏడాది నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

ఇక అందులో ఎవరెవరు నటిస్తారు అనే విషయంలో కూడా గాసిప్స్ ఊహించని విదంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ ను సెలెక్ట్ చేసుకుంటే పాన్ ఇండియా సినిమాగా తెరపైకి తీసుకురావచ్చని యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు. మరి వారి ఆఫర్ కు ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus