ఆ కారణంగా పాపులర్ సింగర్ విడాకులు.. షాక్ లో ఇండస్ట్రీ

  • November 7, 2023 / 08:24 PM IST

ఇప్పుడు జనరేషన్ కంప్లీట్ గా మారిపోయింది. ఒకప్పుడు ప్రేమ, పెళ్లి అంటే జనాలు కూడా వింతగా చూసేవారు. ఇప్పుడు అన్నీ చేసేసి కూడా బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు కొంతమంది యువతీ యువకులు. ఇక సినీ పరిశ్రమలో ఇలాంటి వ్యవహారాలు కొత్తేమీ కాదు. కొంతమంది నటీనటులు ప్రేమ, డేటింగ్ అంటూ కలిసి తిరగడం.. కొంతకాలం గడిచాక అభిప్రాయబేధాలు, మనస్పర్థలు అంటూ విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు సైతం విడిపోయి..

వార్తల్లో నిలుస్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ లిస్ట్ గురించి చెప్పుకోవాలి అంటే చాలా ఉంటుంది. ఇప్పటికీ ఇలాంటి షాకింగ్ న్యూస్ లు వస్తూనే ఉన్నాయి. మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అలాంటి విషయం గురించే చెప్పుకోబోతున్నాం. విషయం ఏంటంటే..ప్రముఖ ర్యాప్ సింగర్ హనీ సింగ్ కొంతమందికి తెలిసే ఉండొచ్చు. తాజాగా అతను తన భార్య షాలిని తల్వార్తో విడాకులు తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

కొన్ని నెలల క్రితం ఢిల్లీ హైకోర్టులో వీళ్ళు విడాకుల కోసం అప్లై చేసుకోగా…, పలు సెషన్స్ తర్వాత ఫైనల్ గా ఇప్పుడు వీరికి విడాకులు మంజూరు అయినట్లు తెలుస్తుంది. 11 ఏళ్ళు సంతోషంగా కలిసి జీవించిన ఈ జంట.. మనస్పర్థలు రావడంతో విడిపోవడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. 2011 జనవరి 23న హానీ సింగ్- షాలినీ తల్వార్ పెళ్లి చేసుకున్నారు. ఇక దేశి కళాకర్, సన్నీ సన్నీ, బ్లూ ఐస్ వంటి పాటలతో హనీ సింగ్ (Singer)  బాగా పాపులర్ అయ్యాడు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus