ఈ వెడ్డింగ్ సీజన్లో సెలబ్రిటీలంతా వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు.. దాదాపుగా చాలామంది తమ మనసుకి నచ్చిన వారితో ఏడడుగులేస్తున్నారు.. మరికొంత మంది ఎంచక్కా ఎంగేజ్మెంట్స్ చేసేసుకుంటున్నారు.. పూర్ణ వంటి వారు సీమంతం ఫంక్షన్స్ జరుపుకోగా.. ఇటీవలే యాంకర్ లాస్య రెండోసారి బాబుకి జన్మనిచ్చింది.. ఇప్పుడు మరో లవ్ బర్డ్స్ సీక్రెట్‌గా షాదీ చేసుకున్నారు. సడెన్‌గా ఈ విషయం తెలిసి వారి ఫ్యాన్స్, ఆడియన్స్ షాక్ అయ్యారు.. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకపోవడానికి గల కారణాలు చెప్పిన తర్వాత.. ఓ.. అదా అసలు విషయం అంటూ వాళ్లకి విషెస్ తెలియజేస్తున్నారు.. వివరాల్లోకి వెళ్తే..
బాలీవుడ్ స్టార్ సింగర్ హర్షిత్ సక్సేనా, నటి సమోనికా శ్రీవాత్సవ నెల రోజుల క్రితం రహస్యంగా వివాహం చేసుకున్నారు.. నెల రోజల తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టారు.. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్ తనకు ఓ రాజకీయ వేత్తతో వివాహం జరిగిందని ఫోటోలు షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. తాజాగా ఇదే దారిలో వెళ్లింది మరో స్టార్ కపుల్.. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షిత్ సక్సేనా మాట్లాడుతూ.. ”నటి సమోనికా శ్రీవాత్సవను ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకున్నాను.
మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇక పెళ్లికి రెండు రోజుల ముందే మా నిశ్చితార్థం జరిగింది. తర్వాత అతి కొద్ది మంది బంధువల సమక్షంలో మాత్రమే మా వివాహం ఛత్తీస్‌ఘడ్‌లో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగింది” అని చెప్పుకొచ్చాడు. అయితే పెళ్లి విషయాన్ని దాచడానికి గల కారణాన్ని కూడా వెల్లడిస్తూ.. ‘‘నాకు వరుసగా షెడ్యూల్స్ ఉన్నాయి.. పెళ్లి తర్వాత వెంటనే కంటిన్యూస్‌గా లైవ్ షోస్ ఉన్నాయి.. అందుకే వెడ్డింగ్ విషయం ఎవరికీ చెప్పలేదు..
అయితే మా ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఏర్పాటు చేసే ప్లాన్‌లో ఉన్నాను.. నేను, సమోనికా ఫస్ట్ టైమ్ ముంబైలో కలిశాం. అప్పటి నుంచి మా మధ్య పరిచయం పెరిగింది. అయితే మా పరిచయాన్ని మా ఇంట్లో వాళ్లు ప్రేమగా భావించారు. సమోనికా అమ్మ మా తల్లిదండ్రులతో మాట్లాడటంతో మా వివాహనికి అడుగులు పడ్డాయి’’ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు హర్షిత్ సక్సేనా..
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!