ఒకప్పుడంటే భారీ వసూళ్లు, 50, 100, 150 ఇంకా 175 రోజుల పోస్టర్లు, సెంటర్లు.. ఇంకా బీభత్సం అయితే 365 డేస్.. అత్యద్భుతం అయితే 500.. ఇక ఎవరి వల్లా కాదు అనుకుంటే 1000 రోజులకు పైగా సినిమాలు ఆడడం అనేది హిస్టారికల్, హిస్టరీలో నిలిచిపోయే రికార్డ్.. రాను రాను పరిస్థితులు మారిపోయాయి.. వంద రోజుల మాట అటుంచితే ఓ స్టార్ హీరో సినిమా కీనీసం 4 వారాల పాటు థియేటర్లలో ఉంది అంటే సూపర్ హిట్ కిందే లెక్క.. ఇక సెంటర్ల సంగతి సరేసరి.. ఎన్ని కోట్లు రాబట్టింది..
ఫస్ట్ డే ఎంత.. ఏ ఏరియాలో ఎంత.. ఓవర్సీస్‌లో ఎన్ని మిలియన్స్ కలెక్ట్ చేసింది.. ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఎంతమంది చూశారు.. ఇలాంటి లెక్కలొచ్చేశాయి.. జనాలకు అర్థం కాక పోయినా.. ఇదే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడైనా ఇవే లెక్కలు.. హీరోల మార్కెట్, రేంజ్ ఏంటనేది తెలియజేయడంలో కలెక్షన్లేవి కీలకపాత్ర పోషిస్తున్నాయి.. పాండమిక్ తర్వాత ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టిన ఇండియన్ హీరోలు, సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..