ప్రభాస్ కి శుభాకాంక్షలు చెప్పిన సినీ తారలు

తెలుగు చిత్ర పరిశ్రమలో అభిమానించేవారు తప్ప.. ద్వేషించేవారు లేని హీరో ప్రభాస్. ఈగోలకు దూరంగా ఉంటూ… అందరితో స్నేహంగా ఉండే డార్లింగ్ నేడు తన 39వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ప్రభాస్‌ పై శుభాకాంక్షల వర్షం కురిపించారు. ఆ విషెష్ వారి మాటల్లోనే..

నవ్విస్తూనే ఉండాలి
ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఇలాగే అందరినీ నవ్విస్తూనే ఉండాలి డార్లింగ్‌.
– కొరటాల శివ

టేక్‌ కేర్‌ ప్రభాస్‌
హ్యాపీ బర్త్‌డే టు ది డార్లింగ్ ఆఫ్‌ ది వరల్డ్‌. ఎందరో ప్రేక్షకులు నిన్ను ఆదరిస్తారు. టేక్‌ కేర్‌ ప్రభాస్‌. నీలాంటి మంచి వ్యక్తి ఎప్పుడూ బాగుండాలి. – జగపతిబాబు

ఈ ఏడాది గొప్పగా ఉండాలి
మన ఆలిండియా సూపర్‌స్టార్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని ఆశిస్తున్నాను. – రకుల్‌ప్రీత్ సింగ్‌

మా స్ఫూర్తి మీరే..
హ్యాపీ బర్త్‌డే రెబెల్‌స్టార్ ప్రభాస్‌. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ వ్యక్తిత్వం చూసి నేనెంతో స్ఫూర్తిపొందాను.
– శ్రీవిష్ణు

గాడ్‌ బ్లెస్‌ యు
హ్యాపీ బర్త్‌డే రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌. గాడ్‌ బ్లెస్‌ యు. మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.- కల్యాణి ప్రియదర్శన్‌

‘సాహో’ కోసం చూస్తున్నాం..
ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నాకు తెలిసిన మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. ‘సాహో’ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.- మారుతి

ఎన్నో హిట్స్ అందుకోవాలి..
యూనివర్సల్‌ డార్లింగ్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు తెలిసిన మంచి మనసున్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఎప్పుడూ ఇలాగే ఆడుతూ పాడుతూ మరెన్నో విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను.
– మురళీ శర్మ

నెగ్గడం.. తగ్గడం తెలిసినోడు..
నెగ్గడం తెలిసినోడు.. అలాగే తగ్గడమూ తెలిసినోడు. మా ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
– సుధీర్‌బాబు

హ్యాపీ బర్త్‌డే ప్రభాస్‌
చక్కగా మాట్లాడతారు. నేను కలిసిన మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. హ్యాపీ బర్త్‌డే ప్రభాస్‌. – అదా శర్మ

కింగ్‌ ఆఫ్‌ హార్ట్స్‌
మన డార్లింగ్‌, కింగ్‌ ఆఫ్‌ హార్ట్స్‌ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. – అడివి శేష్

స్వీట్‌హార్ట్‌ డార్లింగ్‌
డబుల్‌ కా మీఠా, రసగుల్లా, కాకినాడ ఖాజా, మా స్వీట్‌హార్ట్‌ డార్లింగ్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
– బ్రహ్మాజీ

నీ పయనంలో నేను ఉన్నందుకు సంతోషం
మనందరి స్వీట్‌హార్ట్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సాహసోపేతమైన సినీ కెరీర్‌లో నేనూ భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. – రాధాకృష్ణ

‘సాహో’ దినోత్సవ శుభాకాంక్షలు
విలువ కట్టలేని బంగారం, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. డార్లింగ్‌ ప్రభాస్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. అభిమానులకు ‘సాహో’ దినోత్సవ శుభాకాంక్షలు. – సంపూర్ణేశ్‌బాబు

ఎంతో ఆతృతగా ఉంది…
హ్యాపీ బర్త్‌డే ప్రభాస్. ‘సాహో’ సినిమాకు నేపథ్య సంగీతం అందించే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ వినిపించాలని ఎంతో ఆతృతగా ఉంది. – తమన్‌

మీరున్న స్థలం స్వర్గం
మన డార్లింగ్‌ ఆఫ్‌ ది నేషన్‌ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీతో కలిసి నటించేటప్పుడు సెట్‌ అంతా భూమిపై ఉన్న స్వర్గంలా ఉంటుంది. – వెన్నెల కిశోర్‌

వీరితో పాటు రానా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus