ఫిట్‌నెస్ ట్రెండ్స్ అంటే ఒకప్పుడు జిమ్, యోగా, ఫుడ్ డైట్ లాంటివి మాత్రమే వినిపించేవి. అయితే ఇప్పుడు వీటికి తోడు ఐవోటీ డివైజ్లు, ఫిట్‌నెస్ రింగ్‌లు, బ్యాడ్జ్‌లు లాంటివి కూడా వచ్చాయి. వాటికి ఫిట్‌నెస్ స్టిక్కర్ వచ్చి ఒకటి యాడ్ అయింది. గతంలో ఉన్న స్మార్ట్ వాచ్‌కి బదులు ఈ బ్యాడ్జ్‌లు, రిస్ట్ బ్యాండ్‌లు, రింగ్‌లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దానికి స్టిక్కర్ ఒకటి యాడ్ అయింది. దీన్ని ఇండియన్ సినిమాలో ఫిట్‌నెస్ అంటే పడిచచ్చిపోయే రకుల్ ప్రీత్ సింగ్ ధరించి చూపించింది.
రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ సమయంలో ఆమె మెడపై ఓ గుండ్రటి తెల్లటి స్టిక్కర్ అతికించి ఉంది. దీంతో దానిపై అందరి దృష్టి పడింది. ఆ తెల్లటి స్టిక్కర్‌పై కొత్త చర్చ మొదలైంది. ఇదేదో గాయానికి వేసినట్లుగా లేదని, ఏదో స్పెషల్‌గా ఉంది అని చాలామంది అనుకున్నారు. వారు అనుకున్నదే నిజమైంది. ఆ స్టిక్కర్ పేరు లైఫ్ వేవ్ ఎక్స్- 39 ప్యాచ్. దీన్ని ధరించడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శరీరంలోని మూలకణాల్ని ప్రేరేపించేలా ఈ ప్యాచ్ పని చేస్తుందట. దీంతో బాడీలో కొత్త శక్తి వస్తుందట. చర్మాన్ని కాంతివంతంగా చేయడంతో పాటు, కండరాల్ని ఉత్తేజంగా ఉంచడానికి ఈ ప్యాచ్ ఉపయోగపడుతుందని, యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ప్యాచ్‌ను రోజులో 12 గంటల పాటు పెట్టుకోవచ్చట. రకుల్ ఈ ప్యాచ్‌ను విదేశాల నుంచి తెప్పించుకొని వాడుతోందని సమాచారం.
ఫిట్‌నెస్ అంటే పడి చచ్చిపోయే రకుల్ అని పైన చెప్పారు కదా.. అంత ఫిట్‌నెస్ ఫ్రీకా అని అడుగుదాం అనుకుంటున్నారా? ఆమె ఫిట్‌నెస్ పిచ్చి గురించి చెప్పాలంటే ఏదైనా విదేశాలకు వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్టులో ఎక్కువ సేపు వెయిటింగ్ చేయాల్సి వస్తే అక్కడ జిమ్ ఉందా లేదా కనుక్కుని ఆ వెయిటింగ్ టైమ్‌ను జిమ్‌కి వాడేస్తుందట.