గత కొంత కాలం నుంచి సహజీవనం చేస్తున్న ప్రముఖ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తమ వివాహ వీడియోను నరేష్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో విషయం బయటకి వచ్చింది. నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా.. పవిత్రకు సెకండ్ మ్యారేజ్. గత కొద్ది రోజుల నుండి నరేష్, పవిత్ర వివాహ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే వీరి వివాహం నిజమే అని పలువురు నమ్ముతుంటే.. ఇంకొందరు ఏదో మూవీ కోసం నరేష్, పవిత్ర ఆడిన డ్రామా ఇదని అంటున్నారు. ఇలాంటి తరుణంలో పవిత్ర లోకేష్ పై ఆమె మొదటి భర్త చేసిన సంచలన కామెంట్స్ అందరినీ విస్మయానికి గురి చేసింది. మొదట పవిత్ర కన్నడ సీరియల్ యాక్టర్ సుచేంద్ర ప్రసాద్ ను మ్యారేజ్ చేసుకుంది. ఇద్దరు పిల్లలకు పుట్టారు. ఆ అనంతరం భర్తతో విభేదాలు రావడంతో..
అతడి నుంచి సెపరేట్ అయింది. ఆపై నరేష్ తో చట్టాపట్టాలేసుకుని తిరగడం స్టార్ట్ చేసింది. అయితే నరేష్, పవిత్ర వివాహ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే.. సుచేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఆయన షాకింగ్ విషయాలు బయటపెట్టారు. పవిత్ర లోకేష్ ఒక అవకాశవాది అని, విజయనిర్మల గారు కష్టపడి సంపాదించిన రూ. 1500 కోట్ల ఆస్తిని నొక్కేసిందని సుచేంద్ర తెలిపాడు. నరేష్ , పవిత్ర ఇద్దరూ కలిసి జల్సాలు చేస్తూ విజయనిర్మలమ్మ గారి కష్టార్జితాన్ని పాడు చేస్తున్నారని ఆయన కోపం వ్యక్తం చేశారు.
లగ్జరీగా జీవించడం పవిత్రకు ఇష్టం అని ఆమెకు డబ్బులు ముఖ్యమని సుచేంద్ర ప్రసాద్ చెప్పారు. నా దగ్గర డబ్బులు లేకపోవడంతో నరేస్ ను పెళ్లి చేసుకుందని.. అతడి దగ్గర డబ్బు అయిపోతే మరొకరి దగ్గరకు వెళ్లిపోతుందని ఆరోపణలు వేశారు. ఇక నరేష్, పవిత్రలది వ్యామోహమో.. ప్రేమో తెలియదు.. కానీ పవిత్ర లోకేష్ మాత్రం ఒక ఆశావాది.. డబ్బుపై ఆశతోనే నన్ను నా పిల్లలను మోసం చేసిందని సుచేంద్ర కుండబద్దలు కొట్టారు. దీంతో ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్