Sudheer Babu: పొట్ట పెంచిన సుధీర్ బాబు.. వైరల్ అవుతున్న వీడియో!

  • February 28, 2023 / 10:26 AM IST

సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు, మహేష్ బాబుకు బావ అయిన సుధీర్ బాబు వాళ్ళ రిఫరెన్స్ తోనే సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ‘ఎస్.ఎం.ఎస్’ చిత్రంతో ఓకే అనిపించుకుని తర్వాత ‘ప్రేమ కథా చిత్రం’ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. అటు తర్వాత ‘భలే మంచి రోజు’ ‘సమ్మోహనం’ వంటి హిట్టు సినిమాల్లో కూడా నటించాడు. కానీ స్టార్ గా ఎదగలేకపోయాడు అది వేరే విషయం అనుకోండి. అయితే సుధీర్ బాబు వయసు ఇప్పుడు 42 సంవత్సరాలు.

అయినా 25 ఏళ్ళ కుర్రాడిలానే కనిపిస్తాడు. టాలీవుడ్లో ఉన్న అందరి హీరోల కన్నా చాలా ఫిట్ గా ఉంటాడు. ‘ఇతను 365 రోజులు అదే ఫిజిక్ తో ఉంటాడని’ ఓ ఇంటర్వ్యూలో రానా కూడా చెప్పుకొచ్చాడు. సుధీర్ బాబు ఫిజిక్ ను చూసి కుళ్లుకునే హీరోలు టాలీవుడ్లో ఉన్నారనడంలో కూడా అతిశయోక్తి లేదు. అలాంటి సుధీర్ బాబు.. పొట్ట పెంచితే ఎలా ఉంటుంది. వినడానికే షాకింగ్ గా ఉందా.. నిజంగా సుధీర్ బాబు తన నెక్స్ట్ సినిమాలో పొట్టేసుకుని కనిపించబోతున్నాడు.

అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. విషయంలోకి వెళితే.. ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి’ బ్యానర్ పై నారాయణ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావులు కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సుధీర్ బాబు హీరోగా కాగా … ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన హర్షవర్ధన్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం.

తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మామా మశ్చీంద్ర’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోలో సుధీర్ బాబు పొట్టేసుకుని వచ్చి ఓ కుర్చీలో కూర్చున్నాడు. చాలా చబ్బీ చబ్బీగా కనిపిస్తున్నాడు.నిజంగా సుధీర్ బాబు లావు అయ్యాడా లేక ఏదైనా టెక్నాలజీ వాడి అతన్ని ఇలా చూపిస్తున్నారా? అనే అనుమానాలు రేకెత్తేలా ఈ వీడియో ఉంది.. మీరు కూడా ఓ లుక్కేయండి :

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus