‘రేష్మి- సుధీర్’ ఎఫైర్ పై ఓపెన్ అయిపోయారు!!!

బుల్లి తెర అందాల యాంకర్ రేష్మి గౌతమ్, ఇప్పుడు అరకొరా సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ తనదైన శైలిలో అందాలు ఆరబోసుకుంటూ పోతుంది ఈ బ్యూటీ. అయితే అదే క్రమంలో బుల్లి తెరపై కూడా రకరకాల షోస్, చేస్తూ హంగామా చేస్తుంది. ఇదిలా ఉంటే జబర్దస్ట్ ప్రోగ్రామ్ మొదలైన సమయం నుంచి రేష్మి, సుడిగాలి సుధీర్ మధ్య ఏదో నడుస్తుంది అని అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో సార్లు ఆ ఇద్దరూ వాటిని ఖండించినప్పటికీ ఇంకా వారిపై గాసిప్పులు వస్తూనే ఉన్నాయి. అయితే అదే కమంలో ఈ ఎఫైర్ పై ఓపెన్ అయిపోయాడు గెటప్ సీను.

సుధీర్ గెటప్ శ్రీనులు పాల్గొన్న ఫేస్ బుక్ లైవ్ చాట్ లో అనేక మంది అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలతో పాటుగా మరికొందరు అభిమానులు సుడిగాలి సుధీర్ రేష్మీల మధ్య ప్రేమాయణం నడుస్తోందా అని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ గెటప్ శ్రీను అసలు నిజాలను బయట పెట్టాడు. ఆయన మాట్లాడుతూ…రేష్మి సుధీర్ ల మధ్య ఎఫైర్ పుట్టడానికి కారణం తామే అని, స్కిట్లు చేసేప్పుడు కూడా టీమ్ మెంబర్స్ ఒకరి పై ఒకరు పై ఒకరు వేసుకునే సెటైర్ల నేపధ్యంలో రేష్మి సుధీర్ లు కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం చూసిన వారికి ఇలాంటివి చూసిన వారెవ్వరికైనా ఈ అనుమానాలు ఏర్పడటం సహజమేనని అన్నాడు.

అంతేకాకుండా రేష్మీ సుధీర్ లు ప్రస్థుతం పీకలలోతు ప్రేమలో ఉంటూ సహజీవనం చేస్తున్నారని వీరిద్దరి మధ్య పెళ్ళి త్వరలో జరగబోతుంది అని మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు అని, మీరు అవన్నీ నమ్మవద్దు అంటూ తెలిపాడు గెటప్ సీను. ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి, స్కిట్ లో పంచ్ లు పేలడానికి వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు సరదాగా కామెంట్స్ చేస్తాం కానీ, అలాంటివి ఏమీ లేవు అని తెలిపాడు. ఏది ఏమైనా…మరోసారి దీనిపై జస్టిఫికేషన్ ఇచ్చాడు మన సీను. ఇప్పటికైనా మన మీడియా వాళ్ళు కాస్త ఆలోచిస్తే మంచిది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus