ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

సెలబ్రిటీల దుస్తుల ధర గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్లు అంతేసి ధరలు పెట్టి ఆ డ్రెస్‌లు కొంటుంటారు కాబట్టి. కొన్ని కొలాబరేషన్‌లు కూడా ఉంటాయి అనుకోండి. అయితే అంత ధర దుస్తులు ఇచ్చి మరీ ప్రమోట్‌ చేసుకుంటున్న వారెవరు అనే చర్చ ఆ సందర్భంలో జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఇలాంటి చర్చ రావడానికి కారణం అయితే సెలబ్రిటీ సుహానా ఖాన్‌. అవును షారుఖ్‌ ఖాన్‌ కుమార్తె గురించే ఇదంతా.

Suhana Khan

హీరోయిన్‌గా సరైన సినిమా ఒక్కటి కూడా తీయకపోయినా.. బాలీవుడ్‌ సెలెబ్రిటీల్లో ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న సెలబ్రిటీ తనయ సుహానా ఖాన్‌. ఏదైనా కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆమె డ్రెస్సింగ్‌ సెన్స్‌, అవుట్‌ఫిట్‌ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. అలా ఆమె ఇటీవల ప్రముఖ డిజైనర్‌ సంస్థ కార్టియర్‌ నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మెరిసోయింది. అలెక్స్‌ పెర్రీ రూపొందించిన స్ట్రాప్‌లెస్‌ కాలమ్‌ డ్రెస్‌తో పాటు, లేస్‌ ట్రిమ్‌ సిల్క్‌ కాడీ శాటిన్‌ మినీ డ్రెస్‌ ధరించింది.

ఆ అవుట్‌ఫిట్‌కి సంబంధించిన ఫొటోలను సుహానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. స్ట్రాప్‌లెస్‌ కాలమ్‌ డ్రెస్‌ ధర సుమారు రూ.2.15 లక్షలని సమాచారం. ఇక లేస్‌ ట్రిమ్‌ సిల్క్‌ కాడీ శాటిన్‌ మినీ డ్రెస్‌ ఖరీదైతే రూ.6.6 లక్షలు అని తెలుస్తోంది. దీంతో అంత రేటా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయినా ఆమెకున్న పేరుకి, తండ్రికున్న ఆస్తికి ఆ ధర తక్కువే అని కామెంట్స్‌ చేసినవాళ్లూ ఉన్నారు. ఏదేమైనా ఇంకా స్టార్‌ హీరోయిన్‌ అవ్వకుండానే సుహానా స్టార్‌లా మెరిసిపోతోంది.

ఆమె పూర్తి స్థాయి హీరోయిన్‌గా రూపొందుతున్న తొలి సినిమా ‘కింగ్‌’ను డిసెంబరులో విడుదల చేయాలని చూస్తున్నారు. తెలుగులో అదే సమయంలో నాగార్జున్‌ ‘కింగ్ 100’, బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని సినిమాలు రానున్నాయి. దీంతో బాక్సాఫీసు దగ్గర అదిదిరిపోయే క్లాష్‌ ఉండబోతోంది.

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus