పవన్ కల్యాణ్‌తో సినిమాలు అనౌన్స్ అయిన దర్శకులు, సెట్స్ మీద సినిమాలు ఉన్న దర్శకులు వేరే ప్లాన్స్ ఉంటే చూసుకోవాలి అని మొన్నీమధ్యే మనం అనుకున్నాం. అందుకు తగ్గట్టే ఒక దర్శకుడు కొత్త సినిమా స్టార్ట్ చేసేశారు. ఇప్పుడు రెండో దర్శకుడు కూడా అదే పనిలో ఉన్నారు అంటున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే… ఇప్పుడు పవన్‌తో చేస్తున్న సినిమా జోనర్‌లోనే ఆ కొత్త సినిమా కూడా ఉంటుందట. అంతేకాదు ఆ హీరోకు ఈ తరహా సినిమా కొత్త కూడా. ఆ మాటకొస్తే అలాంటి సీరియస్ పాత్రలు నప్పడం లేదు ఈ మధ్య అతనికి.
పవన్ కల్యాణ్ ఆ మధ్య వరుసగా సినిమాలు ఓకే చేసేశారు. ఒకానొక సందర్భంలో సినిమాల రిలీజ్ డేట్‌ల విషయంలో కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు మారడంతో అంతా మారిపోయింది. పవన్ కల్యాణ్ సినిమా పడవ నుండి పాలిటిక్స్ పడవ ఎక్కేశారు. దీంతో ‘భవదీయుడు భగత్‌సింగ్’, ‘ఓజీ’ సినిమాలు సెట్స్ మీదే ఉండిపోయాయి. మొన్నటికి మొన్న ‘మిస్టర్ బచ్చన్’తో హరీశ్ శంకర్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి, స్టార్ట్ చేసేశారు కూడా.
ఇప్పుడు అదే స్టైల్‌లోకి ‘ఓజీ’ దర్శకుడు సుజీత్ వచ్చేశాడు అంటున్నారు. పవన్ తిరిగి సినిమాల్లోకి రావడానికి కనీసంలో కనీసం ఐదారు నెలలు పడుతుంది అంటున్నారు. అందుకే ఈ లోపు నానితో ఓ సినిమా చేద్దామని సుజీత్ అనుకుంటున్నాడట. ఈ మేరకు ఓ గ్యాంగ్‌స్టర్ కథను ఇటీవల నానికి చెప్పి ఓకే చేయించుకున్నాడు అంటున్నారు. వరుసగా ఫీల్ గుడ్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు చేస్తున్న నాని ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుందని అనుకుని ఓకే చేశాడు అని అంటున్నారు.
అన్నట్లు ఈ సినిమా నిర్మాత కూడా డీవీవీ దానయ్యే అంటున్నారు. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా, ‘బలగం’ వేణు డైరక్షన్‌లో మరో సినిమా ఉంటుంది అన్నారు. మరి సుజీత్ (Sujeeth) సినిమా ముందా అవి ముందా అనేది చూడాలి.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!