Pushpa Movie: బన్నీ ఆశలు పుష్పతో తీరతాయా?

  • September 1, 2021 / 07:25 PM IST

స్టార్ హీరో అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ పార్ట్1 షూటింగ్ దాదాపుగా పూర్తైందని తెలుస్తోంది. మేరేడుమల్లి ప్రాంతంలో ఇప్పటికే పుష్ప యూనిట్ పలు సీన్లను షూట్ చేసింది. అయితే పుష్ప కొత్త షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ మరోసారి మేరేడుమల్లి ప్రాంతానికి వెళుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం యూనిట్ సభ్యులు షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లతో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ షెడ్యూల్ షూటింగ్ తర్వాత వచ్చే నెలలో ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసి అక్టోబర్ లో సినిమాకు గుమ్మడికాయ కొట్టాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

క్రిస్మస్ పండుగ కానుకగా పుష్ప మూవీ రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటన వెలువడింది. బన్నీరష్మిక సినిమాలో భార్యాభర్తలుగా కనిపిస్తారని ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం. బన్నీ ఐకాన్ మూవీని పూర్తి చేసిన తర్వాత పుష్ప పార్ట్2 షూటింగ్ లో పాల్గొననున్నారు. అయితే బన్నీ అభిమానులు మాత్రం పుష్ప పార్ట్1, పార్ట్2 కొన్ని నెలల గ్యాప్ తో రిలీజైతే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పుష్ప పార్ట్1తో పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలని బన్నీ భావిస్తున్నారు.

బన్నీ ఆశలు పుష్ప సినిమాతో తీరతాయో లేదో చూడాల్సి ఉంది. దర్శకుడు సుకుమార్ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు పుష్ప సినిమాలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. సుకుమార్ ఈ సినిమాతో రంగస్థలం సినిమాను మించిన హిట్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus