దేవి శ్రీ ప్రసాద్….సంగీత ప్రవాహంలో ఇరగదీస్తూ అందరినీ తన సంగీతంతో కట్టి పడేస్తుంటాడు మన యువ సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్… చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకూ అందరినీ తన సంగీతంతో అలరిస్తూ అందరి సినిమాలకు తనదైన శైలిలో మ్యూజిక్ మ్యాజిక్ చేస్తూ ఉండడం దేవి మ్యానరిజం. అయితే అలాంటి యంగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్…హీరోగా మారితే భలే ఉంటుంది కదా…అవును నిజమే దేవి హీరోగా మారితే సూపర్ ఉంటుంది. ఈ ఆలోచన మనకే కాదు…మన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కి ఎప్పుడో అప్పుడెప్పుడో రెండు ఏళ్ల క్రితమే వచ్చింది…అయితే ప్రయత్నాలు అయితే చేశాడు కానీ…ఫలితం మాత్రం దక్కకపోవడంతో అదే విషయంపై తన ఒపీనియన్ ను మరో సారి తెలిపాడు ఈ దర్శకుడు. అసలు విషయం ఏమిటి అంటే…నిన్న జరిగిన ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్ దేవి గురించి చెబుతూ తనను హీరోని చేసే బాధ్యత తనదే అని అన్నాడు.
రంగస్థలం నా స్వార్ధం కోసం ఒప్పుకున్న సినిమా అది చేయకుంటే కచ్చితంగా దేవితో సినిమా చేసే వాడిని ఇప్పటికే ఒక కథను సిద్ధం చేసుకున్నా నన్నాడు సుకుమార్. దేవి కూడా సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇన్నాళ్లు మ్యూజిక్ డైరక్టర్ గా ఉన్న డిఎస్పి హీరోగా ఎలాంటి టర్న్ తీసుకుంటాడో చూడాలి. ఒకవేళ ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే ఇక ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులే అంచనా వేస్తారు. దేవి హీరోగా సుక్కు డైరక్షన్ లో సినిమా కోసం ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఆ సినిమా ముహుర్తం ఎప్పుడు ముడిపడుతుందో చూడాలి. మొత్తంగా చూసుకుంటే మన దేవి శ్రీ ప్రసాద్ హీరోగా మారితే యువ హీరోలకు మంచి కొంపిటేటివ్ గా తయారవుతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చూద్దాం మరి దేవి మ్యూజిక్ లోనే కాకుండా….హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.