ఒక షో తర్వాత ఒక షో… రోజూ ఏదో ఒక షో.. సినిమాల సీజన్ వస్తే ప్రీ రిలీజ్‌లు, సక్సెస్ మీట్లు… ఇలా సుమ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. టీవీ షోలు, సినిమాల కార్యక్రమాలతో నిత్యం ఏదో ఛానల్‌లో కనిపిస్తూనే ఉంటుంది. మరి అంత బిజీ షెడ్యూల్‌ని ఆమె అంత బాగా ఎలా హ్యాండిల్ చేస్తున్నారా అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. మంచి మేనేజర్‌ను పెట్టుకున్నారా.. ఆమెనే హ్యాండిల్ చేస్తారా అనే డౌట్ అందరికీ వస్తుంటుంది. దీనికి ఆమెనే సమధానం చెప్పింది.
తెలుగు టీవీ రంగంలో ఏదైనా షో చేయాలంటే, సినిమా రంగంలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సుమ. ఆమె అందుబాటులో లేకపోతే వేరే వాళ్లను తీసుకుంటారని అందరూ అంటుంటారు. అంతలా బిజీ షెడ్యూల్‌ను ఆమె చక్కగా హ్యాండిల్ చేయడానికి కారణం ఆమె మేకప్ టీమ్ అంట. సుమ రోజూ వరుస షూటింగ్‌లతో బిజీగా ఉంటుంది. షూటింగ్స్‌కు తగ్గట్లుగా కాస్ట్యూమ్స్ మారుస్తూ ఉండాలి. ఇదంతా తన మేకప్ టీమ్ చక్కగా చూసుకోవడం వల్లే అన్ని షోలు చేయగలుగుతున్నా అని చెప్పింది సుమ.
మా వాళ్ళు పర్‌ఫెక్ట్‌గా అన్నీ ప్లాన్ చేసి ఉంచడం వల్లే రోజులో అన్ని షూటింగ్ లను పూర్తి చేయగలుగుతున్నా అంటూ గర్వంగా చెబుతుంటుంది సుమ. అలాగే షోస్‌లో కొత్త కొత్త చీరలు కడుతుంటా కదా అవన్నీ నావే అనుకుంటూ ఉంటారు. కానీ అందులో నిజం లేదని చెబుతోంది. ఆమె ఏడాదిలో మొత్తంగా మహా అయితే రెండు, మూడు చీరలు మాత్రమే కొంటుంటదట. అంతేకాదు ఆమెకు షాపింగ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదట.
Most Recommended Video
జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?